Viral Video: నడిరోడ్డుపై భర్త చెంపలు వాయించిన భార్య.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:11 PM
Woman Slaps Husband: నడిరోడ్డుపై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్తపై రెచ్చిపోయింది. అతడ్ని బాగా కొట్టింది. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే చెంపలు వాయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

నేనింతే సినిమాలో రవితేజ చెప్పినట్లు... ప్రతీ రిలేషన్‌కు మూడు కావాలి. లవ్, టైం, మనీ.. ఈ మూడిట్లో ఏది తక్కువైనా ఆ రిలేషన్ దెబ్బ తింటుంది. మరీ ముఖ్యంగా... డబ్బుకు ప్రేమ అవసరం లేదు. కానీ, ప్రేమకు మాత్రం కచ్చితంగా డబ్బు అవసరం. పూరీ జగన్నాథ్ జీవితాలను బాగా చదివాడు కాబట్టి ఈ డైలాగులను రాశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఆర్థిక ఇబ్బందులు లేకపోతేనే బంధం సాఫీగా సాగుతుంది. లేకపోతే గొడవలతో ప్రతీ రోజూ నరకం చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మగవాడికి అస్సలు విలువ ఉండదు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ భార్య డబ్బు సంపాదన లేని భర్తను దారుణంగా అవమానించింది. నడిరోడ్డుపై అతడి చెంప పగులగొట్టింది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ జంటకు కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. బొట్టు సంపాదన లేదంటూ భార్య.. భర్తతో తరచుగా గొడవపెట్టుకునేది. ఎంత గొడవపడ్డా అతడు మారకపోవటంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఓ రోజు డబ్బుల విషయంలో రోడ్డుపై భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య.. భర్తపై రెచ్చిపోయింది. సంపాదన లేని నువ్వు అసలు మగాడివేనా.. అంటూ దూషించింది. అంతటితో ఆగకుండా అతడిపై చెయ్యి చేసుకోవటం మొదలెట్టింది. అతడి చెంపలు వాయించింది.
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అతడి కాలర్ పట్టుకుని మరీ కొట్టింది. ఇక్కడ దారుణం ఏంటంటే.. ఆ వ్యక్తి ఉద్యోగానికి వెళ్లటం లేదంట.. ఆమె డబ్బులు సంపాదిస్తే తిని తిరుగుతున్నాడట. ఉద్యోగంలో చేరమని, డబ్బులు సంపాదించమని ఎంత మొత్తుకున్నా వినకపోవటంతో ఆమె గొడవపెట్టుకుంది. నడిరోడ్డులో భర్తను కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భార్యకు సపోర్టుగా మాట్లాడుతుంటే.. మరికొంతమంది భర్తను సపోర్టు చేస్తూ భార్యను తిడుతున్నారు. సంపాదన లేకపోతే మాత్రం భర్తను అలా నడిరోడ్డులో కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
లవర్‌తో పట్టుబడ్డ భార్య.. నిలదీస్తే.. నీకు నేవీ ఆఫీసర్ గతే పడుతుందంటూ