Shocking Video: సముద్రంపై ఓడ.. కమ్ముకొస్తున్న తుఫాను.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:33 PM
ప్రకృతి ఉగ్రరూపం దాల్చినపుడు తల వంచాల్సిందే తప్ప ఇంకేం చేయలేరు. ముఖ్యంగా విశాల సముద్రం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో సముద్రం మీద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

ప్రకృతి (Nature) ఎంత అందమైనదో, అంతే భయంకరమైనది కూడా. ప్రకృతి శక్తి ముందు ఏ ఇతర శక్తీ నిలవలేదు. ప్రకృతి ఉగ్రరూపం దాల్చినపుడు తల వంచాల్సిందే తప్ప ఇంకేం చేయలేరు. ముఖ్యంగా విశాల సముద్రం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో సముద్రం (Sea) మీద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. హాలీవుడ్ సినిమాలో గ్రాఫిక్స్ సీన్‌లా కనబడుతోంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఓడ (Ship) సముద్రంపై నెమ్మదిగా కదులుతోంది. ఆ సమయంలో దాని ముందుగా ఓ పెద్ద ఇసుక మేఘం (Sand Storm) కమ్ముకువస్తూ కనబడుతోంది. కొద్ది సేపటికి ఆ ఓడను ఆ ఇసుక మేఘం కమ్మేసింది. ఇటువంటి ఇసుక తుఫానులను హబూబ్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా పొడి, తీరప్రాంతాలలో బలమైన గాలుల కారణంగా ఏర్పడతాయి. వేడి గాలి అధిక వేగంతో వీచినపుడు, దానితో పాటు తీరంలోని ఇసుక కూడా పైకి లేస్తుంది. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ఎడారి ప్రాంతాలలో కనిపిస్తాయి.
అలాంటి ఇసుక తుఫానులు సముద్రాన్ని చేరుకున్నప్పుడు, మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇలాంటి ఇసుక తుఫానుల కారణంగా ఓడలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. సముద్రం పైన ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదని ఒకరు కామెంట్ చేశారు. చూడడానికి ఇది హారర్ సినిమాలా ఉందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..
Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..