Share News

Indian Menu for Hollywood star: హాలీవుడ్ స్టార్ ఇంట్లో డిన్నర్ పార్టీ.. ఏ భారతీయ వంటకాలు సిద్ధం చేశారో చూస్తే.

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:58 PM

ఓ హాలీవుడ్ స్టార్‌ కోసం ఏయే భారతీయ వంటకాలను సిద్ధం చేసిందీ చెబుతూ ఇజా ఖాన్ అనే సెలబ్రిటీ షెఫ్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

Indian Menu for Hollywood star: హాలీవుడ్ స్టార్ ఇంట్లో డిన్నర్ పార్టీ.. ఏ భారతీయ వంటకాలు సిద్ధం చేశారో చూస్తే.
Indian Menu for Hollywood star

ఇంటర్నెట్ డెస్క్: మసాలాలు దట్టించి వండే భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎందరో విదేశీయులు మన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. తాజాగా ఓ హాలీవుడ్ స్టార్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అతిథులకు తప్పనిసరిగా భారతీయ రుచులను పరిచయం చేయాలని షెఫ్‌ ఇజ్జా ఖాన్‌ను కోరారు. హాలీవుడ్ స్టార్ సూచనల మేరకు తాను ఏయే భారతీయ రుచులకు వండి వడ్డించిందీ చెబుతూ ఆమె ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

ఆ హాలీవుడ్ స్టార్ కోసం రెండోసారి డిన్నర్ పార్టీకి ఏర్పాట్ల కోసం వచ్చినట్టు ఇజా ఖాన్ తెలిపారు. మొదటి నుంచి చివరి వరకూ ఏ వంటాలు ఏలా చేసిందీ, ఏ ఏర్పాట్లు చేసిందీ చెప్పుకొచ్చారు.


Also Read: 70 ఏళ్ల క్రితం బెంగళూరు ఎలా ఉండేదో చూస్తే.. నెట్టింట ఫొటో వైరల్

వీడియో మొదట్లో ఆమె తన కారులో వంటకు కావాల్సిన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుని సదరు సెలబ్రిటీ ఇంటికి వెళ్లారు. అతిథుల కోసం పలు వంటకాలు ఉన్న మల్టిపుల్ కోర్స్ డిన్నర్ సిద్ధం చేసినట్టు తెలిపారు. చిల్లీ చికెన్, బంగాళదుంప క్రాకెట్స్, అపటైజర్ల కింద ట్యూనా టోస్టాడాస్ చేసినట్టు చెప్పారు. మెక్సికన్ వంటకం స్ఫూ్ర్తితో తాను దీన్ని రెడీ చేసినట్టు తెలిపారు.

ఆ తరువాత చికెన్ కుర్మా, మఖనీ సాస్‌తో కూడిన బటర్ పనీర్ చేసినట్టు తెలిపారు. వీటికి తోడు చివర్లో స్పానిష్ ఫ్లాన్ కూడా చేసినట్టు తెులిపారు. మొదటి సారి కంటే ఈ సారి పని సులువుగా జరిగిపోయిందని, అప్పటికంటే మెరుగ్గా ఏర్పాట్లు చేసుకుని తాను వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ వంటకాలను షేర్ చేస్తూ నెటిజన్లను తమ అభిప్రాయం చెప్పాలని కూడా కోరారు.


Also Read: భార్యతో ఆఫీసు ముచ్చట పంచుకున్నందుకు ఊస్టింగ్.. టెకీకి షాకిచ్చిన మెటా

కాగా, ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏకంగా పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె పాకశాస్త్ర ప్రావీణ్యానికి, భారతీయ వంటలు వండిన తీరుకు అనేక మంది ముగ్ధులైపోయారు. అందరి మెప్పు పొందేలా ఆమె వంట చేసేందుకు ఆమె ఎంత కష్టడింతో చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఆమె కష్టజీవి అని, సూపర్ హీరో అని ప్రశంస్లో ముంచెత్తారు. ఆమె చేసిన వంటకాలు చూస్తుంటేనే నోరూరిపోతోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Mar 18 , 2025 | 02:58 PM