Share News

Passport Lost: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..

ABN , Publish Date - Mar 30 , 2025 | 07:31 PM

విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. పాస్‌పోర్టు పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Passport Lost: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా భద్ర పరుచుకోవాల్సిన డాక్యుమెంట్స్‌లో పాస్‌పోర్టు ప్రధానమైనది. కానీ ఒక్కోసారి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పాస్‌పోర్టు పోగొట్టుకోవాల్సి రావొచ్చు . అయితే, ఈ సమస్య నుంచి బయట పడేందుకు పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాస్‌పోర్టు పోయినప్పుడు ఏం చేయాలో సవివరంగా చెప్పారు.

కంగారు వద్దు..

పాస్ పోర్టు పోయిందనగానే కంగారు పడిపోవద్దు. ఎక్కడ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. ముందుగా మీరుంటున్న హోటల్ గదిలో క్షుణ్ణంగా వెతకాలి. బ్యాగులు, జేబులు, బాత్రూమ్ లేదా మరేచోట అయినా పెట్టామేమో గుర్తు తెచ్చుకుని వెతకాలి. చాలా సందర్భాల్లో వెతికితే పాస్‌‌పోర్టు కనిపిస్తుంది.

Also Read: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..


ఎంత వెతికినా దొరకలేదని అనుకుంటే వెంటనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఎంబసీ వ్యవహారాలు చక్కబెట్టే సమయంలో పోలీసు రిపోర్టు అక్కరకు వస్తుంది. విదేశాల్లో ఉన్నప్పుడు పాస్‌పోర్టు పోతే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అత్యవసరం. ఇక ఫిర్యాదుకు సంబంధించి ఓ కాపీ కూడా మీ వద్ద పెట్టుకోవాలి.

ఇక పాస్‌పోర్టు పోయిన విషయాన్ని అక్కడి భారతీయ ఎంబసీకి కూడా సమాచారం అందించాలి. స్పెషల్ ఫోన్ నెంబర్స్, హాట్‌లైన్ ద్వారా ఎంబసీకి సమాచారం అందించే అవకాశం ఉందేమో కూడా తెలుసుకోవాలి. ఎంబసీ వెబ్‌సైట్ సంప్రదిస్తే ఈ విషయాలు తెలుస్తాయి.

Also Read: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

పోగొట్టుకున్న పాస్‌పోర్టు డిజిటల్ కాపీ, పోలీసు రిపోర్టు, విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగులు తదితర వివరాలతో కొత్త పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలి. ఇందుకు సంబంధించి ఫీజు చెల్లించాలి.


పాస్‌పోర్టు పోయిన సందర్భాల్లో అనేక ఎంబసీలు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్స్ జారీ చేస్తుంటాయి. వీటి సాయంతో పరిమితులకు లోబడి టూర్ కొనసాగించడం లేదా స్వదేశానికి తిరిగి రావడం చేయొచ్చు. కొత్త పాస్‌పోర్టు కంటే వేగంగా ఈ పాస్‌పోర్టు జారీ చేస్తారు.

విమాన ప్రయాణాలు ఉన్నట్టైతే ముందుగా పాస్‌పోర్టు పోయిన విషయాన్ని ఆయా ఎయిర్‌లైన్స్‌కు తెలియజేయాలి. ఇలాంటి సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ అదనపు గుర్తింపు కార్డులను కోరవచ్చు. కొన్ని దేశాల్లో పాస్‌పోర్టు లేని ప్రయాణికులకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. వీటి గురించి తెలుసుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ లేకుండా స్వదేశానికి తిరిగి చేరుకోవచ్చు.

Read Latest and Viral News

Updated Date - Mar 30 , 2025 | 07:34 PM