Surat Woman and Daughter Assaulted: షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:31 PM
గుజరాత్‌లోని సూరత్ ఎపీఎమ్‌సీ మార్కెట్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చోరీ చేశారని ఆరోపిస్తూ తల్లీకూతుళ్లను అక్కడి సెక్యూరిటీ గార్డు మరికొందరితో కలిసి దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అది జనాలతో కిటకిటలాడుతున్న మార్కెట్. అక్కడ తల్లీకూతుళ్లను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. నిర్దాక్షిణ్యంగా వారి జుట్టుపట్టి నేలపై ఈడ్చారు. అక్కడున్న వారంతా ఈ దారుణాన్ని చూస్తూ మిన్నకుండిపోయారే తప్ప ఒక్క కూడా కలుగచేసుకోలేదు. బలహీనులపై దాడి తప్పని ఖండించలేదు. మానవత్వానికే మచ్చలా ఉన్న ఈ హృదయవిదారక ఘటన గుజరాత్‌లోని సూరత్‌లోని ఏపీఎమ్‌సీ మార్కెట్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ తల్లీకూతుళ్లు కూరగాయల చోరీకి పాల్పడ్డారు. విషయం బయటపడటంతో వారిపై ఓసెక్యూరిటీ గార్డు మరో ఇద్దరు పురుషులు అత్యంత దాడికి తెగబడ్డారు. ఆ సెక్యూరిటీ గార్డు ఓ చేతిలో కర్ర పట్టుకుని, మరో చేత్తో మహిళ జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చి పారేశాడు. మరో ఇద్దరు వ్యక్తులు ఆమె కూతురిని నేలపైకి తోసి, పొట్టలో తన్నారు.
పబ్లిక్‌గా ఇంత దారుణం జరుగుతున్నా అక్కడున్న వారెవరూ కల్పించుకోలేదు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దారుణంపై సూరల్ పోలీసులు కూడా స్పందించారు. మహిళలపై దాడికి దిగిన వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఇక వీడియోపై నెట్టింట ఆగ్రహం పెల్లుబుకుతోంది. బలహీనులపై ఈ స్థాయిలో దాడి చేయడం క్షమార్హం కాదని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చేయి చేసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళలను కొడుతున్నా కూడా చుట్టూ ఉన్న వారు చూస్తూ మిన్నకుండిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మానవత్వం, పౌర స్పృహ జనాల్లో లోపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు సమాజానికి మంచిది కాదని, ఈ నిర్లిప్తతతో అమాయకులు బలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు
చాట్‌జీపీటీ సలహాలనే వింటున్న బాస్.. అవమానం తట్టుకోలేక ఆ ఉద్యోగి
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..