Viral: ఇంటి ఓనర్‌కు భారీ షాకిచ్చిన పని మనిషి! ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:08 PM
ముంబైలోని కోల్డ్‌ప్లే కాన్సర్ట్ టిక్కెట్ల పనిమనిషి చెత్తబుట్టలో వేయడంతో ఓ యువత దంపతులకు భారీ షాక్. తగిలింది. చెత్తలో వెతికినా అవి దొరకకపోవడంతో వారు కాన్సర్ట్‌ను మిస్సయ్యారు.

ఇంటర్నె్ట్ డెస్క్: బ్రిటన్ పాప్ బ్యాండ్ కోల్డ్‌ప్లే ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. ఇటీవల ముంబైలో కోల్డ్‌ప్లే నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌కు భారతీయ అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. త్వరలో అహ్మదాబాద్‌లో మరో కాన్సర్ట్ కూడా ఉంది. అయితే, ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుదామనుకున్న ఓ జంటకు భారీ షాక్ తగిలింది. పని మనిషి చేసిన పొరపాటు కారణంగా వారు ఓ అద్భుత అవకాశాన్ని మిస్సైపోయారు. చివరకు తమ ఆవేదనను నెట్టింట పంచుకున్నారు (Viral).
Viral: వలసపాలనపై పశ్చాత్తాపం.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ పాప్ సింగర్
ప్రాచీ, ఆమె భర్త ముంబైలోని కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్‌కు వెళదామనుకున్నారు. ఇందుకోసం వారికి రెండు టిక్కెట్లు ఇంటికి డెలివరీ అయ్యాయి. అయితే, వాటిని పేపర్‌లో చుట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. మరుసటి రోజు వచ్చిన పని మనిషి అవి చెత్త కాగితాలు అనుకుని బయట పారేసింది. ఈ విషయం ప్రాచీకి, ఆమె భర్తకు మాత్రం అప్పటికి తెలీదు.
దీంతో, వారు యథాప్రకారం, కాన్సర్ట్‌కు సిద్ధమయ్యారు. టాక్సీని కూడా పిలిపించుకున్నారు. బయటకు వెళ్ళేముందు టిక్కెట్ల కోసం డైనింగ్ టేబుల్ వద్దకు వస్తే అవి కనిపించలేదు. దీంతో, షాకైపోయారు. ఇల్లాంతా వెతికారు. కానీ ఉపయోగం లేకపోయింది. చివరకు పనిమనిషి అడిగారు. దీంతో, ఆమె తాపీగా అసలు విషయం చెప్పింది.
Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో
ఆమె చెప్పిన విషయం వినగానే ప్రాచీ, ఆమె భర్తకు కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అయితే మదిలో ఏదో ఆశ మిణికుమిణుకు మంటుండటంతో ఇంటి చెత్తబుట్టలో వెతికారు. అయినా కనిపించలేదు.
చివరి ప్రయత్నంగా తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ చెత్త బుట్టలో వెతికారు. అయినా ఉపయోగం లేకపోయింది. వారి పరిస్థితి అర్థం చేసుకున్న సిబ్బంది చెత్తను జల్లెడపట్టినా కూడా టిక్కెట్ల జాడ కానరాలేదు. దీంతో, వారు హతాసులయ్యారు.
కాగా, ఈ ఉదంతం తెలిసిన జనాలు ఆ దంపతుల పరిస్థితికి విచారం వ్యక్తం చేశారు. ఒక్కోసారి ఇలాగే జరుగుతుందని, సరిపెట్టుకోవాలని సూచించారు. మరికొందరు మాత్రం సెటైర్లు పేల్చారు. ఆ టిక్కెట్లు తీసుకుని పనిమనిషే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కాన్సర్ట్‌కు వెళ్లి ఉంటుందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..