ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మిఠాయిలు నమిలిన యువతికి దవడ నొప్పి.. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా షాకింగ్ సీన్.. చివరకు..

ABN, Publish Date - Jan 12 , 2025 | 08:28 AM

కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. కొన్నిసార్లు కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యల గురించి విన్నప్పుడు.. ‘‘అరే..! ఇలాక్కూడా జరుగుతుందా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. కొన్నిసార్లు కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యల గురించి విన్నప్పుడు.. ‘‘అరే..! ఇలాక్కూడా జరుగుతుందా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ యువతితో పాటూ ఆమె స్నేహితుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. యువతి మిఠాయిని నమలడంతో దవడ నొప్పి మొదలైంది. చివరకు ఆస్పత్రిలో ఎక్స్‌రే తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన టొరంటోలో (Toronto) చోటు చేసుకుంది. 19 ఏళ్ల ఓ యువతి తన స్నేహితుడితో పాటూ షాపింగ్ చేస్తోంది. ఈ క్రమంలో వారు ఓ దుకాణంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుండగా మిఠాయిలు కనిపించాయి. వాటి రుచి ఎలా ఉంటుందో పరిశీలించాలనే ఉద్దేశంతో సదరు యువతి.. (Young women chewing candy) ఓ మిఠాయిని నోటిలో వేసుకుని నమిలింది.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న చేతి గ్లౌజ్‌ను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అయితే మిఠాయిని నమిలిన మరుక్షణమే ఆమెకు (Jaw pain) దవడ నొప్పి మొదలైంది. అలాగే ఆమె స్నేహితుడు మిఠాయి నమలడంతో పంటి నొప్పి స్టార్ట్ అయింది. దీంతో చివరకు ఇద్దరూ ఆస్పత్రికి వెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు.. చివరకు ఆమెకు ఎక్స్‌రే తీశారు. అయితే చివరకు రిపోర్టు పరిశీలించగా.. షాకింగ్ కనిపించింది. ఆమె దవడ ఎముకలో పగుళ్లు కనిపించాయి. అలాగే ఆమె స్నేహితుడికి కూడా పళ్లు విరిగిపోయాయి. యువతి దవడ ఎముకను సరి చేసిన వైద్యులు.. ఆమె కొన్ని వారాల పాటు నోరు కదిలించకూడదని చెప్పారు.

Viral Video: ఇంట్లో పెద్ద వాళ్లు ఉండాలనేది ఇందుకే.. ఈ చిన్నారిని తాత ఎలా కాపాడాడో చూడండి..


ఇలా మిఠాయిలు తిని దవడ ఎముకలను విరగ్గొట్టుకున్న ఈమెను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇవెక్కడి మిఠాయిలురా బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘మిఠాయిలు తింటే దవడ ఎముక విరగడం ఏంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: భయపెట్టాలని చూశారు.. చివరకు అవాక్కయ్యారు.. పడుకున్న కుక్క పక్కన టపాసు పేల్చడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 12 , 2025 | 08:28 AM