Share News

ఫైనల్లో జమ్వాల్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:46 AM

బ్రెజిల్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ వరల్డ్‌క్‌పలో భారత యువ బాక్సర్‌ అభినాష్‌ జమ్వాల్‌ ఫైనల్‌కు చేరుకొని కనీసం రజతం ఖాయం చేశాడు...

ఫైనల్లో జమ్వాల్‌

బాక్సింగ్‌ వరల్డ్‌ కప్‌

న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ వరల్డ్‌క్‌పలో భారత యువ బాక్సర్‌ అభినాష్‌ జమ్వాల్‌ ఫైనల్‌కు చేరుకొని కనీసం రజతం ఖాయం చేశాడు. పురుషుల 65 కిలోల సెమీ్‌సలో జమ్వాల్‌ 5-0తో గియాన్‌లుగి మలంగ (ఇటలీ)ను మట్టికరిపించాడు. ఫైనల్లో యూరీ రీస్‌ (బ్రెజిల్‌)తో అభినాష్‌ తలపడనున్నాడు. కాగా, 55 కిలోల సెమీ్‌సలో మనీష్‌ రాథోడ్‌ 0-5తో నూర్‌సుల్తాన్‌ అంటెన్‌బెక్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:46 AM