BBL 2025: కొడుకు బౌలింగ్.. తండ్రి క్యాచింగ్.. క్రికెట్ హిస్టరీలో ఎప్పుడూ చూడని సీన్
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:27 AM
కొడుకు బౌలింగ్ వేయడం, బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని తండ్రి క్యాచ్ పట్టడం.. అదీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో! ఊహకు కూడా అందని ఈ ఘటన బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది.
పిల్లల ముఖంలో నవ్వు చూసేందుకు, వాళ్లను సంతోష పెట్టేందుకు ఎంత కష్టపడేందుకైనా తల్లిదండ్రులు వెనుకాడరు. ఎన్ని ఆటుపోట్లు, కష్టనష్టాలు వచ్చినా తట్టుకొని.. వారసుల సక్సెస్‌లో తమ విజయాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లకు నచ్చిన కెరీర్‌లో ఎదిగేందుకు ప్రోత్సహించే పేరెంట్స్ ఎందరో ఉన్నారు. పిల్లలు అనుకున్నది సాధించినప్పుడు తాము రీచ్ అయినంత హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే ఓ తండ్రి తన కొడుకును క్రికెటర్ చేయాలనుకున్నాడు. స్టేడియంలో అతడు బౌలింగ్‌తో అదరగొడితే చూడాలని అనుకున్నాడు. మ్యాచ్‌కు కూడా వెళ్లాడు. కానీ అక్కడ అంతా రివర్స్ అయింది. కొడుకు బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ దంచికొట్టాడు. ఇదే క్రమంలో ఓ సిక్స్ కొట్టగా.. అది కాస్తా బౌలర్ తండ్రి కూర్చున్న చోటకు వెళ్లడం, అతడు దాన్ని అందుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇది బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది.
లైవ్ చూస్తూ పట్టేశాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ వినూత్న ఘటన జరిగింది. ఓ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ స్టేడియంలోకి తరలించగా.. అక్కడే మ్యాచ్‌ను తిలకిస్తున్న ఆ బౌలర్ తండ్రి క్యాచ్ పట్టేశాడు. ఇది బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ సమయంలో చోటుచేసుకుంది. అడిలైడ్ పేసర్ లియామ్ హస్కెట్ బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన బంతి డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌కు వెళ్లింది. అయితే స్టాండ్స్‌లో పడిన బంతిని అక్కడే ఆడియెన్స్ మధ్యలో కూర్చున్న బౌలర్ హస్కెట్ తండ్రి క్యాచ్ అందుకున్నాడు. దీంతో అందరూ చప్పట్లతో అతడ్ని అభినందించారు.
నిరాశలో మునిగి.!
క్యాచ్ పట్టుకోవడంతో లియామ్ హస్కెట్ తండ్రి సంతోషంలో మునిగిపోయాడు. నవ్వుతూ క్యాచ్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఆయన పక్కనే కూర్చున్న సతీమణి మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. కొడుకు బౌలింగ్‌ను బాదేయడంతో ఆమె నిరాశ, నిస్పృహలతో కనిపించింది. అయితే ఆ ఓవర్‌లో ఫెయిలైనా ఓవరాల్‌గా మ్యాచ్‌లో సక్సెస్ అయ్యాడు హస్కెట్. 3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చుకొని 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన బ్రిస్బేన్ 195 పరుగులు మాత్రమే చేసి పరాజయం మూటగట్టుకుంది.
ఇవీ చదవండి:
వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పంత్-జైస్వాల్ మధ్య వార్.. అగ్గిరాజేసింది బీసీసీఐనే..
14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ.. ఈ అమ్మాయి బ్యాటింగ్‌కు ఫిదా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 13 , 2025 | 11:50 AM