ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్‌కు గట్టి షాక్

ABN, Publish Date - Jan 16 , 2025 | 09:32 AM

Team India: గౌతం గంభీర్.. ఆటగాడిగా లెజెండ్ స్థాయిని అందుకున్నాడు. మెంటార్‌గా ఐపీఎల్‌లోనూ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇక కోచ్‌గా కూడా అతడికి తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ దీనికి అంతా రివర్స్‌లో జరుగుతోంది.

Gautam Gambhir

గౌతం గంభీర్.. ఆటగాడిగా లెజెండ్ స్థాయిని అందుకున్నాడు. మెంటార్‌గా ఐపీఎల్‌లోనూ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇక కోచ్‌గా కూడా అతడికి తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ దీనికి అంతా రివర్స్‌లో జరుగుతోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతీ విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ చూశాడు. అతడి హయాంలో శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్, న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్, ఇటీవల ఆసీస్‌తో బీజీటీలో భారత్ దారుణంగా ఓటమిపాలైంది. కివీస్ చేతుల్లో వైట్‌వాష్ అయింది. దీంతో కోచ్‌గా గౌతీ పనికిరాడని తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతడికి షాక్ ఇస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


ఆ కారణాలతోనే..!

టీమిండియా కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారట. హెడ్ కోచ్ గంభీర్‌, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ను మినహాయించి మిగిలిన సపోర్ట్ స్టాఫ్ చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకట్రెండు వారాల్లో ఈ పని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కోచింగ్ స్టాఫ్‌ మార్పునకు బీసీసీఐ వర్గాలు కొన్ని కారణాలు చెబుతున్నాయి. గత కొన్ని సిరీస్‌లుగా భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ లాంటి స్టార్లు అంచనాలను అందుకోలేకపోతున్నారు. కోహ్లీ అయితే 8 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతులను గెలికి ఔట్ అయ్యాడు.


ప్రక్షాళన షురూ!

రోహిత్ కూడా బ్యాటింగ్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం అలవాటుగా మారింది. అటు బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మినహాయిస్తే ఆ లెవల్‌లో ఎవరూ ప్రభావం చూపడం లేదు. మహ్మద్ సిరాజ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో బీసీసీఐ పెద్దలు సీరియస్ అయ్యారట. సపోర్ట్ స్టాఫ్‌గా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డొషేట్, మోర్నీ మోర్కెల్ కావాలని గంభీర్ పట్టుబట్టి తెచ్చుకున్నాడు. అయినా వాళ్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఆటగాళ్ల టెక్నిక్‌ను సరిదిద్దడం, వారిలో ధైర్యాన్ని నింపడంలో కోచింగ్ స్టాఫ్ విఫలమయ్యారని జనవరి 11న ముంబైలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో బోర్డు పెద్దలు గుస్సా అయ్యారట. కొత్త బ్యాటింగ్ కోచ్‌తో పాటు ఇతర సపోర్ట్ స్టాఫ్ నియామకం మీద కసరత్తులు మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. వచ్చే నెలలో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో ఆ టోర్నీ మొదలయ్యే టైమ్‌కు కొత్త కోచ్‌ల నియామకం పూర్తవ్వాలని డెడ్‌లైన్ విధించారట. దీంతో గంభీర్ పవర్స్‌కు చెక్ పడిందని.. ఈ షాక్ నుంచి అతడు ఎలా కోలుకుంటాడో చూడాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

ఆ మాటలు నమ్మొద్దు.. ఫ్యాన్స్‌కు బుమ్రా రిక్వెస్ట్

పారిస్‌ పతకాల నాణ్యతపై విమర్శలు

ఒలింపిక్‌ చాంపియన్‌కు షాక్‌

మంధాన, ప్రతిక శతక జోరు రికార్డుల హోరు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 09:37 AM