CSK vs KKR: చెపాక్‌లో చెత్త రికార్డులు.. తలెత్తుకోకుండా చేశారు
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:24 AM
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌లో లోస్కోరింగ్ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది చెపాక్ స్టేడియం. కేకేఆర్‌తో జరిగిన ఫైట్‌లో చెత్త రికార్డులతో అభిమానుల్ని తలెత్తుకోకుండా చేసింది సీఎస్‌కే. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్స్‌లో కప్పు గెలవాలంటే మూమెంటమ్ కొనసాగించాలి. విన్నింగ్ స్ట్రీక్‌ను మెయింటెయిన్ చేస్తూ పోతే కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతూ పోతుంది. ఇది ప్లేఆఫ్స్, ఫైనల్స్ లాంటి బిగ్ ఫైట్స్‌లో గెలిచేందుకు దోహదం చేస్తుంది. కానీ ఆరంభంలోనే ఓటములతో చతికిలపడితే టీమ్ మళ్లీ లేవడం కష్టం. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అలాగే ఉంది. తాజా క్యాష్ రిచ్ లీగ్ ఎడిషన్‌లో మొదటి మ్యాచ్‌లో నెగ్గిన సీఎస్‌కే.. ఆ తర్వాత వరుసగా 5 పరాభవాలను రుచిచూసింది. నిన్న కేకేఆర్ చేతుల్లో చిత్తుగా ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అంతేగాక చెత్త రికార్డులతో అభిమానుల్ని తలెత్తుకోకుండా చేసింది.
జీర్ణించుకోవడం కష్టమే..
కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఘోర పరాభవంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది ధోని సేన. నిన్నటి మ్యాచ్‌లో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 103 పరుగులు చేసింది ఎల్లో ఆర్మీ. దీంతో చెపాక్ మైదానంలో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా వరస్ట్ రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ హిస్టరీలో ఇది మూడో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఫస్ట్ టైమ్ వరుసగా 5 మ్యాచుల్లో ఓటమిపాలైంది సీఎస్‌కే. అదే సమయంలో తొలిసారి చెపాక్‌లో 3 మ్యాచుల్లో వరుస ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్‌తో పోరులో 59 బంతులు ఉండగానే పరాభవం పాలైంది ధోని సేన. దీంతో బంతుల పరంగా అతి పెద్ద ఓటమిని కూడా అకౌంట్‌లో వేసుకుంది. జట్టు పరాభవానికి తోడు ఈ చెత్త రికార్డులు ఎల్మో ఆర్మీ అభిమానుల్ని మరింతగా నిరాశకు లోను చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
ధోని ఔట్ కాలేదా.. తప్పు ఎవరిది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి