ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

David Warner: జర్రుంటే సచ్చిపోతుండే.. డేవిడ్ భాయ్ అదృష్టం బాగుంది

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:52 AM

ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్ కొంచెంలో బతికిపోయాడు. అతడి అదృష్టం బాగుండటంతో సేఫ్ అయ్యాడు. కాస్త అటు ఇటైనా డేవిడ్ భాయ్ ఫుల్ డేంజర్‌లో పడేవాడు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

David Waner

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీజులోకి అడుగు పెడుతున్నాడంటేనే అపోజిషన్ బౌలర్లు వణుకుతారు. బౌండరీల మోతతో ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడతారు. అతడి ఊచకోత నుంచి ఎలాగైనా తప్పించమని దేవుడ్ని కోరుకుంటారు. అంతలా ప్రత్యర్థులతో ఆడుకుంటాడు డేవిడ్ భాయ్. ఇలా అందర్నీ షేక్ చేసే వార్నర్.. ఒక బంతి దెబ్బకు వణికిపోయాడు. అతడు కొంచెంలో బతికిపోయాడు. అదృష్టం బాగుండటంతో సేఫ్ అయ్యాడు. కాస్త అటు ఇటైనా డేవిడ్ భాయ్ ఫుల్ డేంజర్‌లో పడేవాడు. అసలు వార్నర్‌కు ఏమైంది? అతడికి వచ్చిన ప్రమాదం ఏంటి? ఇది ఎక్కడ జరిగింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..


బ్యాట్ విరగడంతో..!

బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ కొద్దిలో బతికిపోయాడు. ఈ లీగ్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా సిడ్నీ థండర్, హోబర్ట్ హరికేన్స్ మధ్య శుక్రవారం ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిడ్నీ సారథి వార్నర్ గాయపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్ రిలే మెరిడిత్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ పడిన బంతిని బలంగా బాదాడు వెటరన్ బ్యాటర్. అయితే దాన్ని కొట్టే క్రమంలో అతడి బ్యాట్ విరిగింది. క్రికెట్‌లో బ్యాట్లు విరగడం కామనే. విరిగిన బ్యాట్లు ఫీల్డర్లు, బౌలర్ల మీద పడి గాయపర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వార్నర్‌ విషయంలో అలా కాదు.. విరిగిన బ్యాట్ వల్ల అతడి ప్రాణాలే పోయేవి.


గండం గట్టెక్కిన వార్నర్!

బంతిని టైమింగ్ చేసే సమయంలో బలంగా బాదడంతో వార్నర్ బ్యాట్ విరిగింది. అయితే షాట్ కంప్లీట్ చేసే సమయంలో బ్యాట్‌ను కాస్త వెనక్కి తీసుకెళ్లగా.. విరిగిన బ్యాట్ ముక్క వెళ్లి వార్నర్ మెడ, హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. బంతి తాకడంతో కాసేపు కింద కూర్చుండిపోయాడు. కాసేపటికి కోలుకున్న వార్నర్.. హమ్మయ్య బతికిపోయాను అనుకున్నాడు. ఆ తర్వాత అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. జర్రుంటే సచ్చిపోతుండే అని కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఆడు వార్నర్ అని సూచిస్తున్నారు. మెడ మీద ఇంకా బలంగా తాకితే పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. కాగా, ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ భాయ్.. కేవలం లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌-2025 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన డేవిడ్ భాయ్.. బిగ్‌బాష్ లీగ్‌లో రచ్చ చేస్తున్నాడు. భారీ స్కోర్లతో బౌలర్ల బెండు తీస్తున్నాడు.


ఇవీ చదవండి:

స్వామీజీ ఆశీస్సులు.. కోహ్లీకి ఇక తిరుగులేదు

రేడియో జాకీతో చాహల్‌ డేటింగ్‌ ?

వరుణ్‌ ఆరోన్‌ రిటైర్మెంట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2025 | 10:56 AM