Share News

Karun Nair-Jasprit Bumrah: బుమ్రాతో ఆడుకున్న ఢిల్లీ బ్యాటర్.. పేసుగుర్రాన్ని పరేషాన్ చేశాడు

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:44 AM

IPL 2025: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పోయించాడు. భయానికి భయం పుట్టించడం అంటే ఏంటో చూపించాడు. ఫోర్లు, సిక్సులతో బుమ్రాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

Karun Nair-Jasprit Bumrah: బుమ్రాతో ఆడుకున్న ఢిల్లీ బ్యాటర్.. పేసుగుర్రాన్ని పరేషాన్ చేశాడు
Jasprit Bumrah

ప్రస్తుత క్రికెట్‌లో టాప్ బౌలర్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు.. జస్‌ప్రీత్ బుమ్రా. ఈ టీమిండియా స్టార్ పేసర్ ఫార్మాట్ ఏదైనా బ్యాటర్లతో ఆడుకుంటాడు. నిప్పులు చెరిగే బంతులతో వాళ్లకు పోయిస్తాడు. బుల్లెట్ పేస్‌తో అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు, స్వింగర్లకు తోపు బ్యాటర్లు కూడా జడుసుకుంటారు. బుమ్రా బౌలింగ్‌లో రన్స్ తీయడం పక్కనబెడితే ఔట్ అవ్వకుండా ఉంటే అదే పదిలేలని భావిస్తారు. కానీ ఓ బ్యాటర్ మాత్రం పేసుగుర్రాన్ని నిర్దాక్షిణ్యంగా బాదేశాడు. బుమ్రా అయితే నాకేంటి అంటూ ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు. నిల్చున్న చోటు నుంచి గ్రౌండ్ నలుమూలలా షాట్స్ కొడుతూ బౌలింగ్ చేయాలంటే వణికేలా చేశాడు. మరి.. ఎవరా బ్యాటర్ అనేది ఇప్పుడు చూద్దాం..


అలవోకగా సిక్సులు

ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) అదరగొట్టాడు. మంచి అవకావం కోసం ఎదురు చూస్తున్న ఈ టాలెంటెడ్ ప్లేయర్.. నిన్న ముంబైతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కరుణ్.. ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించాడు. 12 బౌండరీలు, 5 సిక్సులతో రచ్చ రచ్చ చేశాడు. 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీని గెలుపునకు చాలా చేరువ చేశాడు నాయర్. అయితే మ్యాచ్‌లో డీసీ ఓడినా.. బుమ్రాను కరుణ్ ఆడుకున్న తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


ఊచకోత కోశాడు

ఢిల్లీ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో 3 స్టన్నింగ్స్ షాట్స్ కొట్టాడు నాయర్. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ ఒక్కో సిక్స్ బాది అందరి మైండ్‌బ్లాంక్ చేశాడు. బచ్చా బౌలర్‌ బౌలింగ్‌లో ఆడుతున్నాడా అనే రేంజ్‌లో బుమ్రా పేస్, స్వింగ్‌ను వాడుకొని బంతిని అలవోకగా ఫెన్స్‌లోకి నెట్టాడు. మొత్తంగా అతడి బౌలింగ్‌లో 3 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. అతడి దెబ్బకు 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు బుమ్రా. వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌ను నాయర్ ఆడుకున్న తీరుకు అంతా షాక్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.


ఇవీ చదవండి:

ఐసీసీలో తిరుగులేని దాదాగిరి

సిక్స్‌ కొడితే రూ.లక్ష

ఐపీఎల్‌లో రోబో డాగ్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 11:48 AM