Share News

DC vs MI Prediction: ఢిల్లీ వర్సెస్ ముంబై ప్రిడిక్షన్.. లెక్కలు మారుస్తారా..

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:02 PM

IPL 2025: వరుసగా హైటెన్షన్ మ్యాచులతో హీటెక్కిస్తోంది ఐపీఎల్. ఒకదాన్ని మించిన మరో ఎడ్జ్ థ్రిల్లర్స్‌ ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ కిక్‌ను డబుల్ చేసేందుకు బ్లాక్‌బస్టర్ సండే వచ్చేసింది.

DC vs MI Prediction: ఢిల్లీ వర్సెస్ ముంబై ప్రిడిక్షన్.. లెక్కలు మారుస్తారా..
DC vs MI Prediction

ఐపీఎల్‌లో ఇవాళ రెండు బ్లాక్‌బస్టర్ మ్యాచులు ఉన్నాయి. అందులో ఒకటైన రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొన్ని నిమిషాల్లో ఇంకో మ్యాచ్ కూడా జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ సాయంత్రం ఎగ్జయిటింగ్ మ్యాచ్ జరగనుంది. లెక్కలు తేల్చాలని ఢిల్లీ చూస్తోంది. పాత లెక్కే రిపీట్ చేయాలని ముంబై భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, గత రికార్డులు, విన్నింగ్ ప్రిడిక్షన్ ఇప్పుడు చూద్దాం..


బలాలు

ఢిల్లీ: ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్టబ్స్, పోరెల్ కూడా రాణిస్తున్నారు. అవసరాన్ని బట్టి కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాట్ కూడా ఝళిపిస్తున్నాడు. అటు బౌలింగ్‌లో విప్రజ్ నిగమ్ బిగ్ అస్సెట్‌గా మారాడు. కుల్దీప్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మోహిత్, స్టార్క్ కూడా చెలరేగితే డీసీకి ఎదురుండదు.

ముంబై: బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ రాణిస్తున్నారు. సూర్యకుమార్, నమన్ ధీర్ కూడా అడపాదడపా పరుగులు బాదుతున్నారు. బౌలింగ్‌లో పాండ్యా రఫ్ఫాడిస్తున్నాడు. బౌల్ట్, విఘ్నేశ్ మంచి కాంట్రిబ్యూషన్స్ అందిస్తున్నారు.


బలహీనతలు

ఢిల్లీ: ఈ టీమ్‌లో పెద్దగా బలహీనతలు కనిపించడం లేదు. బౌలింగ్‌లో విప్రజ్, కుల్దీప్ ఫెయిలైతే మిగతా వాళ్లు వికెట్లు తీయాలి. వాళ్లిద్దరూ విఫలమైతే కష్టాలు తప్పేలా లేవు. బ్యాటింగ్‌లో అంతా రాణిస్తున్నా.. రాహుల్ తప్ప ఎవరూ నిలకడగా పరుగులు చేయడం లేదు. డుప్లెసిస్, మెక్‌గర్క్ కంటిన్యూస్‌గా రన్స్ చేయడం డీసీకి అవసరం.

ముంబై: విల్ జాక్స్, రికల్టన్, రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం.. ముఖ్యంగా హిట్‌మ్యాన్ ప్రతిసారి విఫలమవడం జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో చాహర్, శాంట్నర్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మరో మైనస్. బుమ్రా పరుగులు కట్టడి చేస్తున్నా వికెట్లు తీయడం లేదు.


హెడ్ టు హెడ్

ముంబై-ఢిల్లీ మధ్య ఇప్పటివరకు 35 మ్యాచులు జరిగాయి. ఇందులో 19 సార్లు ఎంఐ, 16 సార్లు డీసీ విజయఢంకా మోగించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

రికార్డుల పరంగా ఢిల్లీపై ముంబైదే పైచేయి. కానీ అక్షర్ సేన ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉంది. ఆడిన 4 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లూ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఇవాళ్టి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గడం పక్కా.

Updated Date - Apr 13 , 2025 | 05:21 PM