Share News

IPL 2025 SRH Victory: అభిషేక్ నువ్వు నిజంగా గ్రేట్.. జ్వరంతో బాధపడుతూ సెంచరీ

ABN , Publish Date - Apr 13 , 2025 | 09:32 AM

హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. శనివారం సాయంత్రం జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో.. హైదరాబాద్ సేన భారీ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు. .

IPL 2025 SRH Victory: అభిషేక్ నువ్వు నిజంగా గ్రేట్.. జ్వరంతో బాధపడుతూ సెంచరీ
Abhishek Sharma

ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలానే ఐపీఎల్లో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు కూడా అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. ఇక భాగ్యనగరం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గతకొన్ని మ్యాచ్‌లలో ఎస్ఆర్‌హెచ్ తన అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తుంది. ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శనివారం నాడు పంజాబ్ సూపర్‌కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెల్చిన పంజాబ్ బ్యాటింగ్‌కు దిగగా.. చేధనకు వచ్చిన ఎస్ఆర్‌హెచ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 246 భారీ స్కోర్‌ని చేధించి.. అనూహ్య విజయం సాధించింది.


ఇక శనివారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ హైలెట్‌గా నిలిచాడు. 55 బాల్స్‌లో 141 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 55 బాల్స్‌లో పది సిక్స్‌లు.. 14 ఫోర్లతో స్కోర్‌ని పరుగులు తీయించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. ’’మ్యాచ్ ముందు వరకు కూడా నా ఆరోగ్యం బాగాలేదు. నాలుగు రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలో కొందరు సీనియర్లు నాతో మాట్లాడి.. ధైర్యం చెప్పారు. ఏం కాదు అని నమ్మకం కలగజేశారు. అప్పటి వరకు కూడా నా మీద నాకు నమ్మకం లేదు. కానీ వారి మాటలతో ధైర్యం వచ్చింది. నా వరకు ఇది నేను ఎదురు చూసిన ఇన్నింగ్స్.. ఈ రోజు అది వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.


"మ్యాచ్ ముందు వరకు కూడా టీమ్ మీద బాగా ప్రెషర్ ఉండింది. కానీ అది నా మీద నెగిటివ్ ప్రభావం చూపలేదు. మ్యాచ్ గెలుపు మీద మా అందరికి నమ్మకం ఉండే. చివరకు అదే నిజం అయ్యింది" అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ గెలుపు మీద అభిషేక్‌కు ముందు నుంచే నమ్మకం ఉంది. అందుకే సెంచరీ పూర్తి చేయగానే.. ఇది ఆరేంజ్ ఆర్మీ కోసం అంటూ ముందే రాసుకొచ్చిన కాగితాన్ని చూపించాడు.


వరుసగా నాలుగు ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన ఎస్ఆర్‌హెచ్ శనివారం నాటి విజయంతో దానికి చెక్ పెట్టింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్.. 6 వికెట్లకు 245 పరుగులు సాధించింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. అత్యంత సునాయాసంగా 18.3 ఓవర్లలోనే.. అది కూడా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 247 పరుగులు సాధించి.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక నిన్నటి మ్యాచ్‌ని షేక్ చేసిన అభిషేక్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

అభిషేక్‌ చేశాడు

Hair Cut: ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే మీ కొంప కొల్లేరే

Updated Date - Apr 13 , 2025 | 09:59 AM