IPL 2025: యూపీఐ కంపెనీలకు ఐపీఎల్ బెట్టింగ్ ఫీవర్.. టెన్షన్ తట్టుకోలేక..
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:55 PM
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ లవర్స్‌ను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది ఐపీఎల్ నయా సీజన్. హైస్కోరింగ్ మ్యాచులు ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి. చాలా మటుకు మ్యాచులు ఆఖరి ఓవర్ వరకు వెళ్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ వల్ల ఎంజాయ్‌మెంట్ ఏమో గానీ యూపీఐ సంస్థలకు మాత్రం ఎక్కడలేని ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ఐపీఎల్ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ లీగ్ వల్ల ప్రముఖ యూపీఐ సంస్థలు ఇదేం టెన్షన్ రా బాబు అంటూ తలపట్టుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటి.. అసలు యూపీఐకి ఐపీఎల్‌కు మధ్య లింక్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం..
బిగ్ ప్రెజర్
ఐపీఎల్‌ను బెట్టింగ్ భూతం వదలడం లేదు. సీజన్ సీజన్‌కూ ఇది మరింత పెరుగుతూ పోతోంది. ఈ బెట్టింగ్ బూమ్ అవుతుండటంతో మన దేశంలోని బ్యాంకులు.. ముఖ్యంగా యూపీఐ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందట. క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల టైమ్‌లో బెట్టింగ్ రూపంలో ఏకంగా ట్రిలియన్ల కొద్దీ విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీని వల్ల యూపీఐ నెట్‌వర్క్ రద్దీ అవుతోందట. బెట్టింగ్‌ల వల్ల భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతుండటంతో వీటి నిర్వహణకు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయడం యూపీఐ సంస్థలకు బిగ్ టాస్క్‌గా మారిందని తెలుస్తోంది.
సిసలైన సవాల్
ఐపీఎల్ బెట్టింగ్ వల్ల భారీ మొత్తంలో లావాదేవీలు జరుగుతుండటంతో మనీ లాండరింగ్‌తో పాటు ఇతర మోసాలను నియంత్రించడం వంటి సవాళ్లను కూడా యూపీఐ సంస్థలు ఎదుర్కొంటున్నాయట. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో సేఫ్టీ, సర్వీస్ క్వాలిటీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు విధించడంతో ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయట యూపీఐ కంపెనీలు. ఐపీఎల్ బెట్టింగ్ వల్ల పలు ఫాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ తక్కువ గ్యాప్‌లోనే పాపులర్ అవుతున్నాయి. కానీ యూపీఐ సిస్టమ్‌లో మాత్రం తరచూ టెక్నికల్ ఇష్యూస్, సర్వీస్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయని సమాచారం. బెట్టింగ్ వల్ల భారీగా లావాదేవీలు జరుగుతుండటంతో వీటిని తట్టుకోవడం పెద్ద సవాలుగా మారిందని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
బుమ్రాతో ఆడుకున్న ఢిల్లీ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి