ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:50 PM

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలో నుంచే అతడు మైదానాన్ని వీడాడు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah

జస్‌ప్రీత్ బుమ్రా.. భారత జట్టుకు తురుపుముక్క లాంటి ప్లేయర్. ఒంటిచేత్తో ప్రత్యర్థిని కుప్పకూల్చే సామర్థ్యం అతడి సొంతం. ఈ టాలెంట్‌తో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు సూపర్ విక్టరీలు అందించాడు. గత ఏడాది కాలంలో అతడి ఫామ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. వన్డే ప్రపంచ కప్-2023 దగ్గర నుంచి టీ20 వరల్డ్ కప్-2024 వరకు.. అలాగే ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దాకా పాల్గొన్న ప్రతి సిరీస్, టోర్నీలోనూ అతడు టాప్ పెర్ఫార్మర్‌గా ఉన్నాడు. అయితే మ్యాచ్ రిజల్ట్‌ను శాసించే స్థాయికి చేరుకున్న బుమ్రా.. మళ్లీ గాయాలతో సతమతం అవుతున్నాడు. వెన్ను నొప్పి కారణంగా సిడ్నీ టెస్ట్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. చాంపియన్స్ ట్రోఫీకి ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ గ్యాప్ లేదు. బుమ్రా ఆ టోర్నీకి దూరమైతే భారత్‌కు కప్పు దూరమైనట్లేనని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఇంజ్యురీ అప్‌డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


ఆడతాడా? దూరమవుతాడా?

సిడ్నీ టెస్ట్‌లో గాయపడిన బుమ్రా పరిస్థితి ఏంటనేది బయటకు రావడం లేదు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రతి దేశం తమ స్క్వాడ్స్‌ను ప్రకటించే బిజీలో ఉంది. జనవరి 12వ తేదీలోపు ఆటగాళ్లతో కూడిన తుదిజట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ డేట్‌కు ఇంకా మూడ్రోజుల సమయం కూడా లేదు. దీంతో బుమ్రాను చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకుంటారా? అతడు కోలుకున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇంజ్యురీ విషయానికొస్తే.. బుమ్రా ఓ న్యూజిలాండ్ సర్జన్‌ను కలిశాడని తెలుస్తోంది. డాక్టర్ రోవాన్ షౌటెన్ అనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిశాడట. 2023లో బ్యాక్ ఇంజ్యురీ అయినప్పుడు ఈ వైద్యుడే బుమ్రాకు చికిత్స అందించాడట. దీంతో మరోమారు ఆయన దగ్గరకు వెళ్లాడట.


సేమ్ డాక్టర్‌తో ట్రీట్‌మెంట్!

బీసీసీఐ మెడికల్ టీమ్‌తో డాక్టర్ రోవాన్ షౌటెన్ టచ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. తదుపరి అతడికి అందించాల్సిన చికిత్స, విశ్రాంతి, మ్యాచ్ ఫిట్‌నెస్ తదిరత అంశాలపై బోర్డు వైద్య సిబ్బందితో రోవాన్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఒకవైపు డాక్టర్ రోవాన్‌-మెడికల్ టీమ్ సంప్రదింపుల సమయంలోనే మరోవైపు బుమ్రాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కు తరలించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో బుమ్రాకు సర్జరీ ఏమైనా చేస్తారా? లేదా నార్మల్ ట్రీట్‌మెంట్‌తో అతడు కోలుకుంటాడా? ఒకవేళ రికవర్ అయినా చాంపియన్స్ ట్రోఫీలోపు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా? అనేది బిగ్ క్వశ్చన్‌గా తయారైంది. అతడు కోలుకునేందుకు కనీసం 6 నెలలు పట్టొచ్చని రూమర్స్ వస్తున్నాయి. అదే నిజమైతే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా, బుమ్రా ఇంజ్యురీ, రికవరీతో సంబంధం లేకుండా అతడ్ని చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకుంటారని.. ఒకవేళ టోర్నీ ఆరంభానికి కోలుకోకపోతే ఉన్న పేసర్లతోనే బరిలోకి దిగుతారని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్

ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

చాంపియన్స్‌ బరిలో ఎవరు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 12:50 PM