Share News

IPL 2025: ఈ బుడతడి తండ్రి ఎవరో తెలుసా.. బ్యాటర్లకు అసలైన మొగుడు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:46 PM

Mumbai Indians: క్రికెటర్ల ప్రొఫెషనల్ ఫొటోస్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడో ప్లేయర్ కొడుకు ఫొటో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: ఈ బుడతడి తండ్రి ఎవరో తెలుసా.. బ్యాటర్లకు అసలైన మొగుడు
Team India

మన దేశంలో క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు ఆడే ప్లేయర్లకు ఫ్యాన్స్ నుంచి గౌరవంతో పాటు అభిమానం, ప్రేమ కూడా లభిస్తాయి. భారత క్రికెటర్లకు సంబంధించిన చిన్న వార్త వచ్చినా అభిమానులు తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తారు. వాళ్ల ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ మీదా ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లేయర్ల కుటుంబ సభ్యులు, వాళ్ల ఇష్టాఇష్టాలు లాంటి సమాచారంపై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ తనయుడి ఫొటోలు నెట్టింట హల్‌‌‌చల్ చేస్తున్నాయి. మరి.. ఆ బుడతడు ఎవరు.. అతడి తండ్రి ఎవరన్నది ఇప్పుడు చూద్దాం..


బ్యాటర్లకు ముచ్చెమటలు

టీమిండియా పేస్ బౌలింగ్‌కు అతడు వెన్నెముక. అతడి పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు గజగజలాడతారు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే వెనుకంజ వేస్తారు. రన్స్ మాట దేవుడెరుగు వికెట్ కాపాడుకుంటే గొప్ప అనేలా క్రీజులో భయంభయంగా కదులుతుంటారు. బ్యాటర్లకు నరకం చూపించే ఆ పేస్ యోధుడు మరెవరో కాదు.. జస్‌ప్రీత్ బుమ్రా. ఈ తోపు పేసర్ గత కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపులో తనదైన రోల్ పోషిస్తున్నాడు. అలాంటోడి కొడుకు అంగద్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చేతిలో ప్లాస్టిక్ బ్యాట్‌తో స్టంప్స్‌ ముందు బుమ్రా కొడుకు నిలబడటం ఫొటోల్లో చూడొచ్చు. దీంతో తండ్రిలా బౌలర్ గాకుండా బ్యాటర్ అవుతాడంటూ అంగద్ ఫ్యూచర్ గురించి జోస్యం చెబుతున్నారు ఫ్యాన్స్. కాగా, గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా.. ఎట్టకేలకు కోలుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ బిజీబిజీగా ఉన్నాడు.


ఇవీ చదవండి:

కాటేరమ్మ కొడుకు అనే నేను..

తండ్రైన టీమిండియా స్టార్

చాహల్‌ను ఇంత లవ్ చేస్తోందా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2025 | 01:56 PM