Kyle Mayers: విండీస్ స్టార్ అన్‌ప్లేయబుల్ డెలివరీ.. ఈ బాల్ బుమ్రా కూడా వేయలేడు
ABN, Publish Date - Feb 04 , 2025 | 03:00 PM
Kyle Mayers Banana Swing Delivery: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కైల్ మేయర్స్ ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఆ బాల్ స్వింగ్ అయిన తీరు చూస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే.

క్రికెట్‌లో ప్రతి పేస్ బౌలర్ బంతిని స్వింగ్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే బాల్ ఒక్కసారి స్వింగ్ అవడం షురూ అయితే ఎంతటి తోపు బ్యాటరైనా తప్పించుకోలేడు. క్యాచ్, ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్.. ఇలా ఎన్నో ఆప్షన్ ఓపెన్ అవుతాయి. అందుకే బంతి స్వింగ్ అవ్వొద్దని బ్యాటర్లు కోరుకుంటారు. అయితే టెస్టులు, వన్డేల్లో బంతి స్వింగ్ అవడానికి స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్‌లో పేస్ వికెట్లను తయారు చేస్తారు. కాబట్టి ఆ చాన్స్ ఉంటుంది. టీ20 క్రికెట్‌లో మాత్రం స్వింగ్‌ను ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ఓ పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లో బంతి అనూహ్యంగా స్వింగై బ్యాటర్‌తో పాటు ఇరు జట్ల అభిమానులను షాక్‌కు గురిచేసింది.
ఇదేం స్వింగ్ సామి!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో అద్భుతం చోటుచేసుకుంది. ఖులానా టైగర్స్ వర్సెస్ రంగాపూర్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పేసర్ కైల్ మేయర్స్ స్టన్నింగ్ డెలివరీ వేశాడు. అతడు సిక్స్త్ స్టంప్ మీద వేసిన బంతి పిచ్ మీద పడ్డాక ఒకేసారి స్వింగ్ అయింది. బనానా షేప్‌లో దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో బాల్‌ను ఫేస్ చేసిన బ్యాటర్ ఖవాజా నఫే షాక్‌కు గురయ్యాడు. బాల్ పడటం, అతడు డిఫెన్స్ చేయడం, బ్యాట్‌ను దాటుకొని వెళ్లి స్టంప్స్‌ను గిరాటేయడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఈ డిస్మిసల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇది మామూలు డెలివరీ కాదని అంటున్నారు. ఇంత స్వింగ్ బహుశా బుమ్రాకు కూడా సాధ్యం కాదేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఈ బాల్‌ను డిఫెండ్ చేసే మొనగాడే లేడని చెబుతున్నారు.
ఇదీ చదవండి:
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..
స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్
బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 04 , 2025 | 03:04 PM