Priyansh Arya: ఒక్క ఇన్నింగ్స్‌తో 8 రికార్డులు బ్రేక్.. ప్రియాన్ష్ వాటే బ్యాటింగ్
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:35 AM
PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ యంగ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ఒక్క సెంచరీతో ఐపీఎల్ కొత్త ఎడిషన్‌ను షేక్ చేశాడు. సూపర్బ్ నాక్‌తో పలు అరుదైన రికార్డులకు పాతర పెట్టాడు. మరి.. ఆ మైల్‌స్టోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పాతికేళ్ల ఓ కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. చాంపియన్ టీమ్‌తో అతడో ఆటాడుకున్నాడు. బౌలింగ్ చేయాలంటేనే వణికేలా చేశాడు. 39 బంతుల్లోనే సెంచరీ బాదేసి.. అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఆ చిచ్చరపిడుగు మరెవరో కాదు.. పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య. సీఎస్‌కేతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతడు సూపర్బ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 42 బంతుల్లో 103 పరుగులతో వహ్వా అనిపించాడు. టీమ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన ఈ డాషింగ్ బ్యాటర్.. 8 క్రేజీ రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రియాన్ష్ రికార్డులు ఇవే:
ఐపీఎల్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత.
క్యాష్ రిచ్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా రికార్డు.
ఐపీఎల్‌లో ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టిన నాలుగో బ్యాటర్.
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్.
ఐపీఎల్ హిస్టరీలో జాయింట్ ఫోర్త్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు.
చెన్నై సూపర్ కింగ్స్ మీద ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్.
ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు (9 సిక్సులు) బాదిన రెండో పంజాబ్ కింగ్స్ బ్యాటర్.
పంజాబ్ కింగ్స్ తరఫున పిన్న వయసులో సెంచరీ బాదిన మూడో బ్యాటర్. ఇలా పై అన్ని ఘనతలను తన పేరు మీద రాసుకున్నాడు ప్రియాన్ష్ ఆర్య.
ఇవీ చదవండి:
నేను మాట్లాడితే కొట్లాటే: రహానె
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి