Chahal-Mahvash: చాహల్‌ను ఇంత లవ్ చేస్తోందా.. ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్
ABN , Publish Date - Apr 16 , 2025 | 10:58 AM
IPL 2025: స్టార్ స్పిన్నర్ చాహల్ కొత్త లవ్ స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చింది. సింగిల్ పోస్ట్‌తో తమ అనుబంధాన్ని రివీల్ చేసింది ఆర్జే మహ్వాష్. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య డివోర్స్, కొత్త లవ్‌స్టోరీతో చర్చనీయాంశంగా మారాడు. ధనశ్రీ వర్మకు అతడు విడాకులు ఇవ్వడం, ఆర్జే మహ్వాష్ అనే అమ్మాయితో ప్రేమాయణం నడపడం, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఆమెతో కలసి అటెండ్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వాళ్లిద్దరిలో ఎవరూ తాము లవ్‌లో ఉన్నామని రివీల్ చేయలేదు. తాజాగా దీనిపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది మహ్వాష్. అసలు కథ ఏంటో బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
సింగిల్ సెల్ఫీతో..
కేకేఆర్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. దీంతో ఈ మ్యాచ్ తర్వాత ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇతడు చాలా ప్రతిభావంతుడు అంటూ చాహల్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది. ఐపీఎల్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఊరికే అవ్వలేదంటూ అతడి కృషి, పట్టుదల, కష్టపడేతత్వాన్ని మెచ్చుకుంది. ఇది నిజంగా అసంభవం అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది ఆర్జే మహ్వాష్. పంజాబ్ కింగ్స్ జెర్సీలో ఉన్న చాహల్‌తో సన్నిహితంగా కలసి దిగిన ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్.. ఒక్క ఫొటోతో తమ లవ్‌ను బయటపెట్టేసిందని చెబుతున్నారు. ఇంత ప్రేమను దాచుకుందా.. చాహల్ గురించి బాగా తెలుసుకుందని, ఆమె మాటలతో అది అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.
నరాలు తెగే ఉత్కంఠ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌లో మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్‌కు మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా నిలిచింది. పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మధ్య జరిగిన ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో ఆఖరుకు అయ్యర్ సేనను విజయం వరించింది. బంతి బంతికీ గూస్‌బంప్స్ తెప్పించిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన కేకేఆర్ 95 పరుగులకే కుప్పకూలింది. చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడ్ని పొగుడుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది ఆర్జే మహ్వాష్.
ఇవీ చదవండి:
ఈ వయసులోనూ.. ఇదేం మ్యాజిక్ అన్నా?
మల్లీశ్వరిని చూసి దేశం గర్విస్తోంది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి