Share News

RCB Breaks Sentiment: సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్దే

ABN , Publish Date - Apr 13 , 2025 | 08:33 PM

IPL 2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. తమను చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న దాన్ని ఎట్టకేలకు అధిగమించింది. దీంతో ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఫ్యాన్స్.

RCB Breaks Sentiment: సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్దే
RCB

క్రికెట్‌లో సెంటిమెంట్స్ ఎక్కువ. వీటిని టీమ్స్, ప్లేయర్స్ అంతగా పట్టించుకోకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. గెలిచినా, ఓడినా.. సెంచరీ కొట్టినా, వికెట్లు తీసినా.. వాళ్లే ఫ్లాప్ అయినా సెంటిమెంట్లకు లంకె వేయడం చూస్తుంటాం. ఐపీఎల్‌లో పాపులర్ టీమ్స్‌లో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఇలాగే ఓ సెంటిమెంట్ ఉంది. దీని వల్ల చాలా మ్యాచుల్లో ఓటమిపాలైంది ఆర్సీబీ. అయితే ఎట్టకేలకు దీన్ని బ్రేక్ చేసింది కోహ్లీ టీమ్. మరి.. ఏంటా సెంటిమెంట్ అనేది ఇప్పుడు చూద్దాం..


ఇక తిరుగులేదు

ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతోంది ఆర్సీబీ. ప్రకృతి పరిరక్షణ, చెట్లు నాటడంపై అందరిలో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో గో గ్రీన్ పేరిట గ్రీన్ జెర్సీ వేసుకొని మ్యాచ్ ఆడతారు బెంగళూరు ఆటగాళ్లు. అయితే ఇలా గ్రీన్ జెర్సీతో ఇప్పటివరకు 14 మ్యాచులు ఆడగా.. అందులో 4 సార్లు మాత్రమే విజయం సాధించింది బెంగళూరు. దీంతో ఈ జెర్సీ ఈ టీమ్‌కు బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో చెలరేగిన ఆర్సీబీ.. 9 వికెట్ల తేడాతో నెగ్గింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకుపోయింది. దీంతో ఈసారి కోహ్లీ టీమ్‌కు తిరుగులేదని.. ఈసాలా కప్ నమ్దే అని అంటున్నారు అభిమానులు. మనల్ని ఎవడ్రా ఆపేది అని చెబుతున్నారు. ఇదే జోరులో మరిన్ని గేమ్స్ నెగ్గి ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని.. ఆ తర్వాత చిరకాలంగా అందకుండా ఉన్న కప్పును కొట్టేయాలని కామెంట్స్ చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.


ఇవీ చదవండి:

కోహ్లీ సంచలన రికార్డు

ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు..

ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 08:35 PM