BBL 2024-25: ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత.. ఈసారి కోహ్లీ టీమ్‌కు కప్ గ్యారెంటీ
ABN, Publish Date - Jan 05 , 2025 | 08:29 PM
ఆర్సీబీ జట్టు బ్యాటర్లకు పెట్టింది పేరు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గకపోయినా ఆ టీమ్ ప్లేయర్లు బ్యాటింగ్ విధ్వంసాల్లో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. మరోమారు ఆ టీమ్ బ్యాటర్ ఒకరు ఊచకోతతో అందరి దృష్టి ఆకర్షించాడు.
ఆర్సీబీ జట్టు బ్యాటర్లకు పెట్టింది పేరు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గకపోయినా ఆ టీమ్ ప్లేయర్లు బ్యాటింగ్ విధ్వంసాల్లో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. మరోమారు ఆ టీమ్ బ్యాటర్ ఒకరు ఊచకోతతో అందరి దృష్టి ఆకర్షించాడు. అతడే టిమ్ డేవిడ్. బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం ఇన్నింగ్స్‌తో మెరిశాడీ పించ్ హిట్టర్. ఊచకోతకు నయా డెఫినిషన్ చెబుతూ విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సులతో స్టేడియాన్ని ముంచెత్తాడు. తనకు బౌలింగ్ చేయాలంటేనే భయపడేలా చేశాడు.
సిక్సుల వర్షం
అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలతో పాటు 6 భారీ సిక్సులు ఉన్నాయి. 221 స్ట్రైక్ రేట్‌తో అతడి బ్యాటింగ్ సాగింది. దీన్ని బట్టే అతడు ఎంతలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. అతడి దెబ్బకు అడిలైడ్ సంధించిన 187 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయింది. ఈ టార్గెట్‌ను 8 బంతులు ఉండగానే హోబర్ట్ అందుకుంది. స్టన్నింగ్ నాక్‌తో అందర్నీ అలరించిన డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా ఆక్షన్‌లో ఆర్సీబీకి అమ్ముడుబోయాడు టిమ్ డేవిడ్. అతడి ఊపు చూస్తుంటే కోహ్లీ టీమ్‌కు ఈసారి కప్ అందించేలా ఉన్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
పేరెంట్స్ ఆ విషయం మరవొద్దు.. సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..
పాత గాయాన్ని మళ్లీ గెలికిన కోహ్లీ.. ఆసీస్‌కు ఆనందం లేకుండా చేశాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 05 , 2025 | 08:29 PM