Virat Kohli: ఈగోలతో ఒరిగేదేం లేదు.. కోహ్లీ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:54 PM
Indian Premier League: ఈగోలతో ఎవరూ ఏదీ సాధించలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు కోసం ఆడటంలోనే అసలైన ఆనందం దాగి ఉందన్నాడు. మరి.. విరాట్ ఇంకా ఏం అన్నాడు ఇప్పుడు చూద్దాం..

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నయా సీజన్‌లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్నాడు కింగ్. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో కలిపి 164 పరుగులు చేశాడతను. టోర్నమెంట్‌లో ఇంకా బోలెడు మ్యాచులు ఉన్నందున విరాట్ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు రావడం ఖాయం. ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ సీనియర్ బ్యాటర్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈగోతో ఏం సాధిస్తారంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. మరి.. విరాట్ ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
నాకు అదే ముఖ్యం
సాధారణంగా కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వస్తుంటాయి. అయితే గత కొన్నేళ్లుగా అతడు తాను బిగ్ స్కోర్స్ కొట్టడంతో పాటు ఇతరులతోనూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడించడంపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లోనూ అతడు ఓ ఎండ్‌లో నిలబడి.. రజత్ పాటిదార్, సాల్ట్, జితేష్ శర్మ వంటి యంగ్‌స్టర్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. తనకు ఎలాంటి ఈగో లేదన్నాడు. వ్యక్తిగత ఆసక్తుల కంటే టీమ్ గెలుపు, ప్రయోజనాల గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానన్నాడు కోహ్లీ. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈగోని తాను ఎప్పుడూ పట్టించుకోలేదని.. అది తనను నడిపిందనేది కరెక్ట్ కాదన్నాడు.
నా వల్ల కాదు
ఈగోకు వెళ్లడం, దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లాంటివి తాను చేయనన్నాడు కోహ్లీ. ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలోనూ అయ్యర్ బాగా ఆడుతుంటే.. తాను మరో ఎండ్‌లో సహకారం అందించానన్నాడు. అవతలి బ్యాటర్ తన కంటే బాగా ఆడినప్పుడు అతడికి సపోర్ట్‌గా ఉంటానని.. అదే తాను ఊపులో ఉన్నప్పుడు చార్జ్ తీసుకొని ఆడతానని తెలిపాడు కింగ్. ఎవరో తనకు పోటీ అని భావించడం, తనను ఎవరైనా దాటేస్తారేమోననే భయంతో బ్యాటింగ్ చేయడం తన వల్ల కాదన్నాడు. గేమ్ సిచ్యువేషన్ ఏంటి.. టీమ్ కోసం ఏం చేయగలం అనేదే తన మైండ్‌లో నడుస్తుంటుందన్నాడు కోహ్లీ. ఈగోతో ఒరిగేదేం లేదని స్పష్టం చేశాడు. అనవసర ఈగోలకు పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇది మంచి చేయదన్నాడు. కాగా, విరాట్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించా అని కొందరు నెటిజన్స్ ఆలోచనల్లో పడ్డారు. అయితే కింగ్ ఫ్యాన్స్ మాత్రం అతడు ఆటను తాను చూసే విధానం గురించి చెప్పాడని అంటున్నారు.
ఇవీ చదవండి:
ప్రీతి జింటా సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ చూడాల్సిందే
నేను మాట్లాడితే కొట్లాటే: రహానె
11 క్యాచులు మిస్.. ఈ టీమ్ ఇక అస్సాంకే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి