Share News

Team India: తండ్రైన టీమిండియా స్టార్.. పిల్లాడి పేరేంటో తెలుసా..

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:15 PM

Indian Premier League: భారత మాజీ ఆటగాడొకరు తండ్రి అయ్యారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత అతడికి సంతానం కలిగింది. మరి.. ఎవరా ప్లేయర్.. అనేది ఇప్పుడు చూద్దాం..

Team India: తండ్రైన టీమిండియా స్టార్.. పిల్లాడి పేరేంటో తెలుసా..
Zaheer Khan

టీమిండియా లెజెండ్ జహీర్ ఖాన్ తండ్రయ్యాడు. ఆయన సతీమణి, బాలీవుడ్ ప్రముఖ నటి సాగరిక ఘట్గే పండండటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. ఈ విషయాన్ని జహీర్-సాగరిక జంట సోషల్ మీడియా ద్వారా తాజాగా అభిమానులతో షేర్ చేశారు. ఈ మేరకు తమ ఫ్యామిలీ ఫొటోను నెట్టింట పంచుకున్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని నామకరణం చేశామని తెలిపారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కంగ్రాట్స్ అంటూ జహీర్-సాగరిక జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఐపీఎల్‌తో బిజీబిజీ

జహీర్-సాగరిక పెళ్లై దాదాపుగా 8 ఏళ్లు కావొస్తోంది. కొన్నాళ్లు లవ్ చేసుకున్నాక 2017 నవంబర్‌లో వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి ఈ స్టార్ కపుల్ ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మొదటి బిడ్డకు జన్మను ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జహీర్ దంపతుల మీద శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకును కూడా నీలాగే చాంపియన్‌ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్.. యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో పండంటి బిడ్డ పుట్టడం అతడి సంతోషాన్ని డబుల్ చేసిందని చెప్పొచ్చు. ఇక, ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 4 విజయాలతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది లక్నో టీమ్.


ఇవీ చదవండి:

ఒలింపిక్స్‌లో క్రికెట్.. క్రేజీ అప్‌డేట్

చాహల్‌ను ఇంత లవ్ చేస్తోందా..

ఈ వయసులోనూ.. ఇదేం మ్యాజిక్‌ అన్నా?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2025 | 12:22 PM