ధీరజ్‌కు శాప్ చైర్మన్ హామీ
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:25 AM
ఆర్చర్లు ధీరజ్, చికితల వీసా కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించారు. అమెరికాలో జరిగే ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో...

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
ఆర్చర్‌తో మాట్లాడిన రవి నాయుడు
నేడు సమస్య పరిష్కారమయ్యే చాన్స్
విజయవాడ (స్పోర్స్ట్) : ఆర్చర్లు ధీరజ్, చికితల వీసా కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించారు. అమెరికాలో జరిగే ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో ఏపీ క్రీడాకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనాలన్న ఉద్దేశంతో...బుధవారం క్రీడాకారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, పార్లమెంటరీ స్పోర్స్ట్ కమిటీ మెంబర్, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగితో క్రీడాకారులను ఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడించారు. వీసా మంజూరులో సమస్యలను పరిష్కరించి వెంటనే క్రీడాకారులు వరల్డ్ కప్‌లో పాల్గొనే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్టు శాప్ చైర్మన్ తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..