Share News

దీపక్‌, ఉదిత్‌కు రజతాలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:36 AM

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ మరో మూడు పతకాలు దక్కించుకుంది. పురుషుల 92 కిలోల విభాగంలో దీపక్‌ పూనియా, 61 కిలోల కేటగిరిలో...

దీపక్‌, ఉదిత్‌కు రజతాలు

ఆసియా రెజ్లింగ్‌లో దినేశ్‌కు కాంస్యం

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ మరో మూడు పతకాలు దక్కించుకుంది. పురుషుల 92 కిలోల విభాగంలో దీపక్‌ పూనియా, 61 కిలోల కేటగిరిలో ఉదిత్‌ రజత పతకాలతో మెరవగా, పురుషుల 125 కిలోల విభాగంలో దినేశ్‌ కంచు మోత మోగించాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో పూనియా 0-10తో ఇరాన్‌ రెజ్లర్‌ అమీర్‌హొసేని చేతిలో, ఉదిత్‌ 4-6తో టకారా (జపాన్‌) చేతిలో ఓడి రజతాలకు పరిమితమయ్యారు. ఇక కాంస్య పతక పోరులో దినేశ్‌ 14-12తో తుర్క్‌మెనిస్థాన్‌ రెజ్లర్‌ సపరోవ్‌ని ఓడించాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 02:36 AM