IPL 2025, CSK vs RR: రాజస్తాన్‌కు తొలి విజయం.. చెన్నై‌కు వరుసగా రెండో ఓటమి

ABN, Publish Date - Mar 30 , 2025 | 11:30 PM

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో డీలా పడిన రాజస్తాన్ రాయల్స్ టీమ్ ఎట్టకేలకు ఒక విజయం అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సాధికారికంగా విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై ఓటములు చవిచూసిన రాజస్తాన్ రాయల్స్ టీమ్ తాజా మ్యాచ్‌లో జూలు విదిల్చింది.

IPL 2025, CSK vs RR: రాజస్తాన్‌కు తొలి విజయం.. చెన్నై‌కు వరుసగా రెండో ఓటమి
Hasaranga

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో డీలా పడిన రాజస్తాన్ రాయల్స్ టీమ్ ఎట్టకేలకు ఒక విజయం అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సాధికారికంగా విజయం సాధించింది (RR vs CSK). గత రెండు మ్యాచ్‌ల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై ఓటములు చవిచూసిన రాజస్తాన్ రాయల్స్ టీమ్ తాజా మ్యాచ్‌లో జూలు విదిల్చింది. గౌహతిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో (IPL 2025) చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు (IPL 2025).


నితీష్ రాణా (36 బంతుల్లో 5 సిక్స్‌లు 10 ఫోర్లతో 81) మెరుపు హఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీష్ రాణాతో పాటు రియాన్ పరాగ్ (37), సంజూ శాంసన్ (16 బంతుల్లో 21) కీలక పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్ (4), ధ్రువ్ జురెల్ (3), హసరంగ (4) పెద్దగా రాణించలేదు. చివర్లో హిట్‌మెయర్ (19) విలువైన పరుగులు చేశాడు. ఆరంభంలో ధారాళంగా పరుగులు ఇచ్చిన చెన్నై బౌలర్లు చివర్లో పుంజుకున్నారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, పతిరణ, ఖలీల్ అహ్మద్ రెండేసి కీలక వికెట్లు తీశారు. అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు. దీంతో ఆర్‌ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.


183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు అరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై ఓపెనర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే అవుట్ చేసి షాకిచ్చాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (63) పోరాడినా ఫలితం కనబడలేదు. రవీంద్ర జడేజా (32), రాహుల్ (23), శివమ్ దూబె (18) పోరాటం సరిపోలేదు. ఈ మ్యాచ్‌లో కాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (11 బంతుల్లో 16) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ హసరంగా నాలుగు వికెట్లు తీశాడు. ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా


IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్


IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2025 | 11:30 PM