Share News

Rishabh Pant: పంత్ నడుం నొప్పి, శార్దూల్ వైడ్‌లు.. కోల్‌కతా ఓటమికి మాస్టర్ ప్లాన్

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:38 PM

మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 238 పరుగుల భారీ స్కోరును కోల్‌కతా ఓ దశలో ఛేదించేలాగానే కనిపించింది.

Rishabh Pant: పంత్ నడుం నొప్పి, శార్దూల్ వైడ్‌లు.. కోల్‌కతా ఓటమికి మాస్టర్ ప్లాన్
Rishabh Pant Use Fake Injury

మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది (KKR vs LSG). లఖ్‌నవూ నిర్దేశించిన 238 పరుగుల భారీ స్కోరును కోల్‌కతా ఓ దశలో ఛేదించేలాగానే కనిపించింది. 12 ఓవర్లకు 149/2తో నిలిచింది. 8 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం ఖాయం. అప్పటికి రహానే (61) దూకుడుగా ఆడుతున్నాడు. ఆ సమయంలో పంత్ (Rishabh Pant) వేసిన మాస్టర్ ప్లాన్ మ్యాచ్ స్వరూపానే మార్చేసింది. మ్యాచ్‌ను కోల్‌కతా కోల్పోయింది (Rishabh Pant Fake Injury).


13వ ఓవర్ వేసే ముందు పంత్ గాయపడినట్టు నటించాడు. నడుం నొప్పి వేధిస్తోందని మైదానంలోనే పడిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అలా కొంత సమయం గడిపి కోల్‌కతా రిథమ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 13వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ వరుసగా ఐదు వైడ్లు వేశాడు. దీంతో కోల్‌కతా బ్యాటర్లు రిథమ్ కోల్పోయారు. అదే ఓవర్లో రహానే అవుటయ్యాడు. ఆ తర్వాత రమణ్‌దీప్, వెంకటేష్ అయ్యర్, రస్సెల్, రఘువంశీ వరుస ఓవర్లలో అవుటై పెవిలియన్ చేరిపోయారు. చివర్లో రింకూ సింగ్ పోరాడినా అప్పటికే ఆలస్యం అయిపోయింది.


రిషభ్ పంత్ ఇలాంటి ట్రిక్ ప్లే చేయడం ఇదే మొదటి సారి కాదు. 2024లో జరిగిన టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో కూడా రిషభ్ పంత్ ఇదే ట్రిక్ ప్లే చేసి దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ జోరుకు బ్రేకులు వేశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన దక్షిణాఫ్రికా పంత్ మాస్టర్ ప్లాన్ కారణంగా రిథమ్ కోల్పోయి వికెట్లు పారేసుకుంది. తాజాగా అదే ట్రిక్‌ను ప్లే చేసి కోల్‌‌కతాపై తన జట్టును గెలిపించాడు. అయితే పంత్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి


IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 07:34 PM