KKR vs RCB: ఈడెన్‌లో డాన్ ఎవరు.. తొలి మ్యాచ్ విజయం ఎవరిది.. వాతావరణం ఎలా ఉంది..
ABN, Publish Date - Mar 21 , 2025 | 09:13 PM
శనివారం సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభం అవుతాయి. శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీ ప్రదర్శనలతో అభిమానులకు ఫుల్ మజా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ ప్రారంభం కాబోతోంది. శనివారం సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే వేడుకలతో ఐపీఎల్-2025 అట్టహాసంగా ప్రారంభం అవుతుంది. శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీ ప్రదర్శనలతో అభిమానులకు ఫుల్ మజా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (KKR vs RCB) జట్టు తలపడబోతోంది. ఈ రెండు జట్లు కలిసి ఓ సీజన్ తొలి మ్యాచ్ ఆడడం ఇదే ప్రథమం. కేకేఆర్‌కు అజింక్య రహానే నాయకత్వం వహిస్తుండగా, ఆర్సీబీకి రజిత్ పటీదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
గత 17 సీజన్లలో కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడగా, కోల్‌కతా 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కొత్త కెప్టెన్ల నాయకత్వంలో బరిలోకి దిగుతున్న రెండు జట్లు ఈ సీజన్‌లో తొలి విజయం అందుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాయి. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్, డికాక్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, నోర్ట్జే, రస్సెల్ కీలకం కాబోతున్నారు. ఆర్సీబీ టీమ్‌లో కోహ్లీ, సాల్ట్, హాజెల్‌వుడ్, దేవదత్ పడిక్కళ్, టిమ్ డేవిడ్ వంటి ప్రతిభావంతులు ఉన్నారు.
ఐపీఎల్-2025 కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ అందరినీ వాతావరణం ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి 22న కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
IPL-2025: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్లు నిషేధం.. మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందన ఏంటంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 21 , 2025 | 09:13 PM