PBKS vs KKR: సొంత గడ్డపై పంజాబ్‍కు పరాభావం.. తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన కోల్‌కతా
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:07 PM
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ ఈరోజు ముల్లన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో అజింక్య రహానె నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తరంగా కొనసాగుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా, ఆటకు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో 2-2 వికెట్లు పడగొట్టారు.
పంజాబ్ జట్టులో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పీబీకేఎస్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ జట్టులో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ త్వరగానే ఆరంభించింది. కానీ నాల్గో ఓవర్ తర్వాత ఆ జట్టు తడబడింది. ఈ ఓవర్‌లో హర్షిత్ రాణా ప్రియాంష్ ఆర్య (22), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (0) వికెట్లు పడగొట్టాడు. జోష్ ఇంగ్లిస్ (2), నెహాల్ వాధేరా (10) ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 76 పరుగులకే పంజాబ్ 6 వికెట్లు కోల్పోయింది.
చివరకు..
ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన శశాంక్ సింగ్ 18 పరుగులు చేసి పంజాబ్ స్కోరును 100 దాటించాడు. హర్షిత్ తన మూడు ఓవర్ల స్పెల్‌లో 25 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ జట్టు శశాంక్ సింగ్ (18) రూపంలో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్ మొదటి బంతికి వైభవ్ అరోరా బౌలింగ్‌లో అతను ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌ను ముగించే క్రమంలో మూడో బంతికే బార్ట్లెట్ (11) రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో చివరకు పంజాబ్ ఆటగాళ్లు.. కేకేఆర్ ముందు 112 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
పాయింట్ల పట్టికలో
పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. పంజాబ్ తమ మునుపటి మ్యాచ్‌లో కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పంజాబ్ సొంత మైదానంలో కోల్‌కతా జట్టను ఓడిస్తుందా లేదా అనేది చూడాలి మరి. చాలా తక్కువ స్కోర్ ఉన్న నేపథ్యంలో పంజాబ్ జట్టుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడగా, మూడు గెలిచి, రెండు ఓడిపోయింది. కోల్‌కతా మాత్రం ఆరు మ్యాచుల్లో మూడు గెలిచి, మూడు ఓడిపోయి, పట్టికలో ఐదో స్థానంలో కలదు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో మార్పు జరగనుంది.
ఇవి కూడా చదవండి:
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News