IPL 2025, LSG vs GT: గుజరాత్ టైటాన్స్ vs లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. ప్లేయింగ్ లెవెన్ చూస్తే
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:38 PM
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దిగ్గజ ఆటగాళ్లతో నిండిన లఖ్‌నవూ మాత్రం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది.

ఈ సీజన్‌లో (IPL 2025) అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దిగ్గజ ఆటగాళ్లతో నిండిన లఖ్‌నవూ మాత్రం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. భారీ స్కోరు సాధించినా కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. కెప్టెన్ రిషభ్ పంత్ వరుస వైఫల్యాలు, బౌలింగ్ గాడిన పడకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి ( LSG vs GT).
గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆరుసార్లు తలపడ్డాయి. అందులో నాలుగు సార్లు గుజరాత్‌దే విజయం. కేవలం రెండు సార్లు మాత్రమే లఖ్‌నవూ గెలుపొందింది. లఖ్‌నవూలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సాయంత్రం ఈ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడుబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే భారీ వర్షం కాకుండా కాసేపు జల్లులు మాత్రమే కురిసే అవకాశం కనబడుతోంది. అయితే లఖ్‌నవూ పిచ్ నుంచి స్పిన్నర్లకు మద్దతు లభించడం లేదు. ఫాస్ట్‌బౌలర్లదే హవా.
లఖ్‌నవూ జట్టుకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్‌క్రమ్ కీలకంగా మారుతున్నారు. టాపార్డర్ విఫలమైతే మాత్రం లఖ్‌నవూకు కష్టాలు తప్పడం లేదు. లోయర్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్ వేగంగా పరుగులు చేస్తున్నాడు. అయితే లఖ్‌నవూ బౌలింగ్ మాత్రం బలహీనంగా ఉంది. శార్దూల్ ఠాకూర్ మాత్రమే రాణించగలుగుతున్నాడు. మరోవైపు గుజరాత్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. మరి, ఈ మ్యాచ్‌లో వరుస విజయాల గుజరాత్‌కు లఖ్‌నవూ చెక్ పెట్టగలదో, లేదో చూద్దాం. లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్వయంగా పరుగులు చేయడంతో పాటు జట్టును ముందుండి ఎలా నడిపిస్తాడో చూడాలి.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ
ఇవి కూడా చదవండి..
IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..