MI VS LSG IPL 2025: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఫీల్డింగ్ ఎంచుకున్న హార్ధిక్

ABN, Publish Date - Apr 04 , 2025 | 07:29 PM

ఎల్‌ఎస్‌జీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

MI VS LSG IPL 2025: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఫీల్డింగ్ ఎంచుకున్న హార్ధిక్
MI VS LSG IPL 2025 MI Wins Toss

ఐపీఎల్ సీజన్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్‌కు తేరలేచింది. యూపీలోని ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

‘‘ఇది ఫ్రెష్ వికెట్‌గా కనిపిస్తోంది. ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. తేమ ఎఫెక్ట్ తరువాత మ్యాచ్ మలిదశలో రావొచ్చు. అయితే, వికెట్ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మంచి గేమ్ ఆడాలని మాత్రం నిర్ణయించుకున్నాము. పరిస్థితులకు తగ్గుట్టు మిమ్మల్ని మేము మలుచుకుంటాము’’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు. తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. అయితే, ఈ మ్యాచ్‌ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు.


ప్లేయింగ్ ఎలెవన్:

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), అయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాథి, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్.

ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, రయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విగ్నేష్ పుతూర్.

ఇవి కూడా చదవండి:

అదే మా కొంపముంచింది: కమిన్స్

కోల్‌కతా వైభవంగా

సూర్య ముంబై వెంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2025 | 07:36 PM