IPL 2025: వైజాగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సాగరనగరంలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు..
ABN, Publish Date - Feb 16 , 2025 | 05:51 PM
క్రికెట్ అభిమానులను అలరించేందుకు అత్యంత ప్రజాదరణ కలిగిన లీగ్ ఐపీఎల్-2025 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మెగా లీగ్‌లో పది జట్లు తలపడబోతున్నాయి. అందులో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
క్రికెట్ అభిమానులను అలరించేందుకు అత్యంత ప్రజాదరణ కలిగిన లీగ్ ఐపీఎల్-2025 (IPL 2025) త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మెగా లీగ్‌లో పది జట్లు తలపడబోతున్నాయి. అందులో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అలాగే సాగర నగరం అయిన విశాఖపట్నం (Visakhapatnam) కూడా గతేడాదిలాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మరో హోమ్ గ్రౌండ్‌గా వైజాగ్‌ను సెలెక్ట్ చేసుకుంది (Cricket News).
గతేడాది కూడా ఢిల్లీ క్యాపిట్సల్స్ ఆడిన రెండు మ్యాచ్‌లు వైజాగ్‌లో జరిగాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం సిద్ధం కాకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ సారి అలాంటి ఇబ్బందులేవీ లేకపోయినా ఢిల్లీ టీమ్ వైజాగ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్ ఇప్పుడు వేరే ఫ్రాంఛైజీకి వెళ్లిపోయాడు. దీంతో ఈ సీజన్‌లో ఢిల్లీ టీమ్‌ను నడిపించేది ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. ఢిల్లీ వేలంలో దక్కించుకున్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లో ఒకరికి కెప్టెన్సీ బాధ్యత అప్పగించే అవకాశం కనబడుతోంది.
ఢిల్లీ కెప్టెన్ ఎవరనే విషయంలో కొన్ని రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఇక, మార్చి 22 నుంచి మే 5వ తేదీ వరకు ఐపీఎల్-2025 జరగబోతోందని సమాచారం. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఈ రోజు సాయంత్రం ప్రకటించేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో కూడా పది జట్టు తలపడుతున్నాయి. ఇటీవల జరిగిన మెగా వేలం ద్వారా చాలా మంది ఆటగాళ్లు కొత్త ఫ్రాంఛైజీలకు ఈ సీజన్ నుంచి ఆడబోతున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 16 , 2025 | 05:51 PM