IPL 2025, MI vs KKR: ముంబై vs కోల్‌కతా.. స్వంత మైదానంలో ముంబైకి తొలి విజయం అందేనా
ABN, Publish Date - Mar 31 , 2025 | 06:28 PM
తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇతర మైదానాల్లో ఆడి ఓడిన ముంబై ఈ సీజన్‌లో తొలిసారి స్వంత మైదానం అయిన వాంఖడేలో బరిలోకి దిగుతోంది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ఓ విజయం సాధించి జోరు మీదున్న కోల్‌కతాను ముంబై ఇండియన్స్ జట్టు ఎలా నిలువరిస్తుందో చూడాలి.

వరుస పరాజయాలతో సతమమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు తొలి విజయం కోసం ఊవిళ్లూరుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇతర మైదానాల్లో ఆడి ఓడిన ముంబై (MI) ఈ సీజన్‌లో (IPL 2025) తొలిసారి స్వంత మైదానం అయిన వాంఖడేలో (Wankhede Stadium) బరిలోకి దిగుతోంది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ఓ విజయం సాధించి జోరు మీదున్న కోల్‌కతాను ముంబై ఇండియన్స్ జట్టు ఎలా నిలువరిస్తుందో చూడాలి (KKR vs MI).
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత పుంజుకుని రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సులభంగా ఓడించింది. ఇక, మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరి, ఈ రోజు మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతా జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ టీమ్ 23 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కతా కేవలం 11 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఇక, వాంఖడే స్టేడియంలో ముంబై టీమ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు వాంఖడేలో ముంబై టీమ్ 85 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 53 సార్లు ముంబైనే విజయం వరించింది. 31 మ్యాచ్‌ల్లో ముంబై ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ముంబై జట్టు కంటే కోల్‌కతా కాస్త బలమైన జట్టుగా కనబడుతోంది. బ్యాటింగ్‌లో కాస్త బలంగానే కనబడుతున్న ముంబై బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. బుమ్రా లేని లోటు కనబడుతోంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 31 , 2025 | 06:28 PM