IPL 2025, PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కు బ్రేక్.. రాజస్తాన్ రాయల్స్ విక్టరీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:21 PM
వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు బ్రేకులు పడ్డాయి. బలమైన పంజాబ్ టీమ్‌కు రాజస్తాన్ రాయల్స్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఘన విజయం సాధించింది.

వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు బ్రేకులు పడ్డాయి. బలమైన పంజాబ్ టీమ్‌కు రాజస్తాన్ రాయల్స్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఏకంగా 50 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (67), రియాన్ పరాగ్ (43 నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఓపెనర్ జైస్వాల్ (Yashasvi Jaiswal), సంజూ శాంసన్ (38) ఆరంభంలో నెమ్మెదిగా ఆడి ఆ తర్వాత గేర్లు మార్చారు. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న జైస్వాల్ ఈ మ్యాచ్‌తో తిరిగి గాడిలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్తాన్ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. హెట్‌మేయర్ (20) కీలక పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను తొలి బంతికే బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్, చివరి బంతికి ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (10) వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత స్టోయినిస్‌ను సందీప్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను కుమార్ కార్తికేయ అవుట్ చేశారు. అయితే నేహల్ వధేరా (62), మ్యాక్స్‌వెల్ (30) రాజస్తాన్ బౌలర్లను భయపెట్టారు. అయితే వారిద్దరూ వరుస బంతుల్లో అవుట్ కావడంతో రాజస్తాన్ విజయం ఖరారైంది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ, తీక్షణ రెండేసి వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..