IPL 2025: సండే డబుల్ ధమాకా ఎందుకు లేదు.. ఈ రోజు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉందేంటి

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:39 PM

ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లు, అంచనాలకు అందని విధంగా సాగే టీ-20 ఫార్మాట్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. ఈ కిక్‌ను వీకెండ్‌లో మరింత పెంచేందుకు ఐపీఎల్ నిర్వాహకులు శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తుంటారు.

IPL 2025: సండే డబుల్ ధమాకా ఎందుకు లేదు.. ఈ రోజు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉందేంటి
IPL 2025

ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2025) ఫీవర్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లు, అంచనాలకు అందని విధంగా సాగే టీ-20 ఫార్మాట్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. ఈ కిక్‌ను వీకెండ్‌లో మరింత పెంచేందుకు ఐపీఎల్ నిర్వాహకులు శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. శనివారం రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆదివారం అయిన ఈ రోజు మాత్రం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగుతోంది. దానికి కారణం ఏంటి? (Double-Header)


నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు కూడా రెండు మ్యాచ్‌లు జరగాలి. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌తో పాటు కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య కూడా మ్యాచ్‌ జరగాలి. అయితే స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు కేకేఆర్, ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌‌ తేదీని మార్చారు. ఈ రోజు కోల్‌కతాలో శ్రీరామ నవమి సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంబరాలకు పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌కు తగినంత సెక్యూరిటీ కల్పించలేమని కోల్‌కతా పోలీసులు తెలిపారు.


కోల్‌కతా పోలీసుల విజ్ఞప్తిని క్రికెట్ అసోషియేషన్ అఫ్ బెంగాల్ యాజమాన్యం బీసీసీఐకి తెలియజేసింది. దీంతో ఈ మ్యాచ్‌ను ఏప్రిల్ 8వ తేదీ అంటే మంగళవారానికి షెడ్యూల్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రెండు మ్యాచ్‌‌లను ఆస్వాదించే అవకాశం క్రికెట్ అభిమానులకు దూరమైంది. మంగళవారం మాత్రం రెండు మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:39 PM