Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌ను ఎలా వాడుకోవాలో చాలా ఐపీఎల్ టీమ్‌లకు తెలియలేదు

ABN, Publish Date - Apr 07 , 2025 | 06:15 PM

బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ బౌలర్లు చెలరేగి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అయితే ఛేజింగ్‌లో గుజరాత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్వల్ప స్కోరును ఛేదించడం కూడా కష్టంగా మారింది.

Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌ను ఎలా వాడుకోవాలో చాలా ఐపీఎల్ టీమ్‌లకు తెలియలేదు
Washington Sundar

ఆదివారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT vs SRH) విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు మహ్మద్ సిరాజ్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ బౌలర్లు చెలరేగి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అయితే ఛేజింగ్‌లో గుజరాత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్వల్ప స్కోరును ఛేదించడం కూడా కష్టంగా మారింది (IPL 2025).


కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మ్యాచ్ గతిని మార్చేశాడు. 29 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌పై మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. * సుందర్ చాలా కాలం పాటు ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతోనే ఉన్నాడు. రూ.8 కోట్లు పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను కొన్న హైదరాబాద్.. అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. గుజరాత్ కూడా తొలి అవకాశం ఇవ్వడానికి చాలా సమయం వేచి చూసింది * అని ఆకాశ్ చోప్రా అన్నాడు.


*సరిగ్గా ఉపయోగించుకుంటే వాషింగ్టన్ సందర్ ఏ జట్టులోనైనా కీలక ఆటగాడు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ చక్కగా ఉపయోగపడతాడు. అతడిని ఎలా ఉపయోగించుకోవాలో చాలా ఐపీఎల్ టీమ్‌లకు తెలియలేదు. వచ్చిన అవకాశాన్ని సుందర్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. సుందర్ ఇన్నింగ్సే ఆదివారం మ్యాచ్‌లో గుజరాత్‌ను గెలిపించింది. బౌలింగ్‌లో పరుగులు నియంత్రించడం ఎలాగో అతడికి తెలుసు. ఇకపై అయినా సుందర్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా* అంటూ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి..

Ricky Ponting: ఆ సమయంలో నాకు ఫోన్ చేసిన తొలి వ్యక్తి ద్రవిడ్.. కీలక విషయం బయటపెట్టిన పాంటింగ్


IPL 2025, MI vs RCB: ముంబైలోకి బుమ్రా ఎంట్రీ.. ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్‌‌పై ఓ లుక్కేద్దాం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 06:15 PM