ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ODI Cricket: జెమీమా సెంచరీ

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:34 AM

టాపార్డర్‌ బ్యాటర్లంతా ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. జెమీమా రోడ్రిగ్స్‌ (102) తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేయగా, హర్లీన్‌ డియోల్‌ (89) కొద్దిలో సెంచరీ చేజార్చుకుంది.

  • రెండో వన్డేలోనూ ఐర్లాండ్‌ చిత్తు

రాజ్‌కోట్‌: టాపార్డర్‌ బ్యాటర్లంతా ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. జెమీమా రోడ్రిగ్స్‌ (102) తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేయగా, హర్లీన్‌ డియోల్‌ (89) కొద్దిలో సెంచరీ చేజార్చుకుంది. ఇక కెప్టెన్‌ మంధాన (73) తన జోరు కొనసాగించగా, యువ క్రీడాకారిణి ప్రతికా రావల్‌ (67) మరో అర్ధ హాఫ్‌ సెంచరీతో భళా అనిపించింది. దాంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 116 పరుగులతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో వన్డే మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 370/5 స్కోరు చేసింది. భారీ ఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 254/7 స్కోరుకే పరిమితమైంది. క్రిస్టినా (80) అర్ధ శతకంతో సత్తా చాటింది.

47 ఏళ్లలో తొలిసారి..: 1978లో ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడింది. ఆ క్రమంలో 47 ఏళ్ల తర్వాత మన జట్టు మొదటిసారి వన్డేలలో 370 పరుగుల మార్క్‌ను అందుకొని రికార్డు సృష్టించింది.

సంక్షిప్తస్కోర్లు

  • భారత్‌: 50 ఓవర్లలో 370/5 (జెమీమా 102, హర్లీన్‌ 89, మంధాన 73, ప్రతిక 67, ప్రెండెర్‌గాస్ట్‌ 2/75, కెల్లీ 2/82).

  • ఐర్లాండ్‌: 50 ఓవర్లలో 254/7 (క్రిస్టినా 80, సారా 38, డెలానీ 37, దీప్తి శర్మ 3/37, ప్రియ 2/53).

Updated Date - Jan 13 , 2025 | 03:35 AM