Khushdil Shah: న్యూజిలాండ్‌తో చేతిలో ఓటమి.. ఆఫ్ఘన్ ప్రేక్షకులను కొట్టబోయిన పాక్ స్టార్ క్రికెటర్
ABN , Publish Date - Apr 05 , 2025 | 08:15 PM
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ స్టేడియంలోని ఇద్దరు ఆఫ్ఘన్ ప్రేక్షకులను కొట్టబోయాడు. పాక్ ఓటమి చెందినందుకు ఆప్ఘాన్ ప్రేక్షకులు నోరుపారేసుకున్నారని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో తమ క్రీడాకారుడి సహనానికి పరీక్ష పెట్టారని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఝన్ ప్రేక్షకులు తమను అసభ్య పదజాలంతో దూషించడం తట్టుకోలేకపోయిన పాక్ స్టార్ క్రికెటర్ ఖుష్‌దిల్ షా వారిపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అతడిని నిలువరించాడు. ఆఫ్ఘన్ అభిమానులు పాక్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తట్టుకోలేకే ఖుష్‌దిల్ సహనం కోల్పోయాడని పాక్ మీడియా పేర్కొంది. సంచలనం కలిగిస్తున్న ఈ ఉదంతాన్ని పాక్ క్రికెట్ బోర్డు కూడా ఖండించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఘోర ఓటమిని చవి చూసింది. 265 లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు వాన రూపంలో తొలుత ఆటంకం ఎదురైంది. ఆ తరువాత మ్యాచ్ కొనసాగిన లక్ష్యం చేరుకోలేక పాక్ ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో పాక్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి. అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20ల్లో పాక్ చిత్తుగా ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కొందరు ప్రేక్షకులు పాక్ ఆటతీరును ఎండగట్టారు. వారికి ఎదురుపడ్డ పాక్ క్రికెటర్ ఖుష్‌దిల్‌ను చూస్తూ అసభ్యపదజాలంతో దూషించారట. పాక్ దేశాన్ని కించపరుస్తూ పాష్తో భాషలో వారు ఇష్టారీతిన నోరుపారేసుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఖుష్‌దిల్ వారిపై దాడి చేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయితే, న్యూజిలాండ్‌తో ఆడుతున్న తుది జట్టులో ఖుష్‌దిల్‌కు చోటు దక్కలేదు.
ఈ ఉదంతంపై పాక్ క్రికెట్ బోర్డు ఖండించింది. తమ జట్టు ఫిర్యాదు మేరకు ఇద్దరు ఆఫ్ఘన్ ప్రేపక్షకులను స్టేడియం నుంచి పంపించినట్టు వెల్లడించింది. పాక్ వ్యతిరేక వ్యాఖ్యలను తట్టుకోలేకే ఖుష్‌దిల్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొంది. ఆప్ఘన్ ప్రేక్షకులే తమ క్రీడాకారుడిని రెచ్చగొట్టారని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి