Share News

LSG vs PBKS: లక్నోను కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్.. స్కోర్ ఎంత చేశారంటే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 08:54 PM

2025 IPLలో 13వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ చేయగా, లక్నో జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే స్కోర్ ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

LSG vs PBKS: లక్నోను కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్.. స్కోర్ ఎంత చేశారంటే..
LSG vs PBKS IPL 2025

ఐపీఎల్ 2025లో 13వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ క్రమంలో ఆటకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.


బాటింగ్‌లో కష్టాలు

లక్నో జట్టు మొదటి వికెట్ కోల్పోయి ప్రారంభించినప్పటికీ, తరువాత పరిస్థితి అంత సులభంగా కనిపించలేదు. మిచెల్ మార్ష్ మొదటి ఓవర్లోనే అవుట్ కావడం, జట్టును కొంత ఇబ్బంది పెట్టింది. ఆ క్రమంలో 3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి, లక్నో స్కోరు 20 పరుగుల వద్ద నిలిచింది. ఇక, ఐడెన్ మార్క్రమ్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ అవ్వడంతో, మరోసారి లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ కూడా 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడం, లక్నో జట్టుకు మరో షాక్ ఇచ్చింది.


హెల్ప్‌ఫుల్ ఇన్నింగ్స్

అయినా నికోలస్ పూరన్ తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును నిలబెట్టాడు. 30 బంతుల్లో 44 పరుగులతో, పూరన్ ఆకట్టుకున్నప్పటికీ, నికోలస్ పూరన్ 4వ వికెట్‌గా ఔట్ అయ్యాడు. లక్నో స్కోరు 91/4గా నిలిచింది. ఈ క్రమంలో 15 ఓవర్లకు ముగిసే సమయానికి, లక్నో జట్టు 4 వికెట్ల నష్టంతో 116 పరుగులు చేసింది. అదే క్రమంలో లక్నోకు ఐదవ దెబ్బ తగిలింది. డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేసిన తర్వాత మార్కో జెన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


సమద్ కూడా..

ఆయుష్ బడోని రూపంలో లక్నోకు ఆరో షాక్ తగిలింది. ఆయుష్ బడోని 41 పరుగులు చేసిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ రూపంలో లక్నో ఏడవ దెబ్బను ఎదుర్కొంది. 27 పరుగులు చేసిన తర్వాత అబ్దుల్ సమద్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో లక్నో చివరకు 20 ఓవర్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ తరఫున అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, ఫెర్గూసన్, మ్యాక్సెవెల్, జాన్సల్, చాహల్ తలో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 01 , 2025 | 09:13 PM