Khel Ratna Award: ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మనూ భాకర్ సహా ముగ్గురికి పురస్కారం..
ABN, Publish Date - Jan 02 , 2025 | 02:52 PM
Manu Bhaker: క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించిన మనూ భాకర్‌తో పాటు పలువురు క్రీడాకారులను ఈ పురస్కారం వరించింది.
క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించిన మనూ భాకర్‌కు ఖేల్ రత్న వరించింది. ఆమెతో పాటు మరో ముగ్గుర్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది మోడీ సర్కారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్, హాకీ స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌కు అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 17వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.
32 మందికి అర్జున అవార్డు..
ఖేల్‌రత్న సాధించిన ఆటగాళ్లు గొప్ప ఘనతలు సాధించడంతోనే అవార్డుకు ఎంపికయ్యారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ నిలిచింది. పర్సనల్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమె కాంస్య పతకాలు కొల్లగొట్టింది. ఫస్ట్ లిస్ట్‌లో ఆమె పేరు రాలేదు. కానీ తాజా జాబితాలో ఆమె పేరును చేర్చారు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన గుకేశ్‌నూ ఖేల్‌రత్న వరించింది. ఒలింపిక్స్‌లో హాకీలో వరుసగా సెకండ్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా పురస్కారానికి ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌లో హైజంప్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టిన ప్రవీణ్ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఇక, 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇందులో జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్) తదితరులు ఉన్నారు.
Also Read:
పంత్‌పై వేటు.. గిల్‌కు చోటు?
నితీష్...ఓ జీనియస్
బుమ్రాను నిరోధించేలా చట్టం
For More Sports And Telugu News
Updated Date - Jan 02 , 2025 | 03:44 PM