Dhoni Childhood Memories: నాన్నంటే ఎంతో భయం

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:56 AM

తన చిన్నతనంలో తండ్రి పాన్‌ సింగ్‌పై భయం ఉండేదని ధోనీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలన తండ్రివల్లే నేర్చుకున్నానని పేర్కొన్నారు

Dhoni Childhood Memories: నాన్నంటే ఎంతో భయం

న్యూఢిల్లీ: చిన్నప్పుడు తనకు నాన్న పాన్‌ సింగ్‌ అంటే ఎంతో భయమనే విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ బయటపెట్టాడు. ఆయన వల్లే ఎంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైందని తెలిపాడు. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. ‘నాన్న ఎంతో కఠినంగా ఉండేవారు. కానీ, ఎన్నడూ కోప్పడలేదు. ఎప్పుడూ సమయపాలన పాటించే వారు. అది నాకు కూడా అలవడింద’ని తెలిపాడు. తన తండ్రి వల్లే జీవితంలో ఎప్పుడూ అభద్రతా భావానికి గురికాలేదన్నాడు.


మళ్లీ ధోనినే..

ముంబయి: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్ల యాజమాన్యం.. ప్రముఖ క్రికెటర్, ఎంఎస్ ధోనితో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 10:40 PM