Share News

1996 వరల్డ్‌కప్‌ విజేతలతో మోదీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:49 AM

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 1996 వరల్డ్‌కప్‌ నెగ్గిన శ్రీలంక క్రికెట్‌ జట్టు సభ్యులను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆ జట్టు సభ్యులైన...

1996 వరల్డ్‌కప్‌ విజేతలతో మోదీ

1996 వరల్డ్‌కప్‌ విజేతలతో మోదీ

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 1996 వరల్డ్‌కప్‌ నెగ్గిన శ్రీలంక క్రికెట్‌ జట్టు సభ్యులను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆ జట్టు సభ్యులైన కుమార ధర్మసేన, అరవింద డిసిల్వ, సనత్‌ జయసూర్య, చమింద వాస్‌, ఉపుల్‌ చందన, ఆటపట్టు.. మోదీకి జ్ఞాపికను బహూకరించారు. ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జున రణతుంగ కెప్టెన్సీలోని లంక ఏడు వికెట్లతో ఆస్ట్రేలియాను ఓడించింది. ‘1996 వరల్డ్‌కప్‌ విజేత లంక జట్టును కలుసుకొన్నందుకు ఆనందంగా ఉంది’ అని ఎక్స్‌లో మోదీ పోస్టు చేశారు. వాళ్లతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:49 AM