IPL 2025: ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు మైండ్‌బ్లాంక్.. వాళ్లపై వాళ్లే మీమ్ వేసుకున్నారు

ABN, Publish Date - Mar 23 , 2025 | 06:19 PM

ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు ఊహించని ఆరంభం ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే హైదరాబాద్ బ్యాటర్లు శివ తాండవం చేశారు. రాజస్తాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ పరుగుల వరద పారించారు. కోట్లు పోసి కొన్న బౌలర్లు ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు.

IPL 2025: ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు మైండ్‌బ్లాంక్.. వాళ్లపై వాళ్లే మీమ్ వేసుకున్నారు
Rajasthan Royals meme

ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు ఊహించని ఆరంభం ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే హైదరాబాద్ బ్యాటర్లు శివ తాండవం చేశారు. రాజస్తాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ పరుగుల వరద పారించారు. కోట్లు పోసి కొన్న బౌలర్లు ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ముఖ్యంగా రూ.13 కోట్లు పెట్టి కొన్న జొఫ్రా ఆర్చర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు.


రాజస్తాన్ బౌలర్లందరూ ఓవర్‌కు 10 పరుగులకు పైనే సమర్పించుకున్నారు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో తమపై తామే మీమ్స్ వేసుకుంది. ఉల్లిపాయలతో లోడ్ చేసి ఉన్న ట్రక్ ఎక్కి ఓ గోనెలో దాక్కున్నట్టు ఓ మీమ్‌ను పోస్ట్ చేసింది. ఆ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మీమ్ చూసిన వారు నవ్వుకుంటున్నారు.


287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కీలకమైన జైస్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. రియాన్ పరాగ్, నితీష్ రాణా కూడా త్వరగా పెవిలియన్ చేరారు. సంజూ శాంసన్ (13 బంతుల్లో 33 బ్యాటింగ్) మాత్రమే నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం రాజస్తాన్ 6 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి..

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే


Virat Kohli - Rinku Singh: కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ


MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 06:19 PM