Rohit Sharma: నాతో పాటు ఆడిన వారు ఇప్పుడు కోచ్‌లుగా ఉన్నారు.. నేనేం చేయాలో నాకు తెలుసు: రోహిత్ శర్మ
ABN, Publish Date - Apr 02 , 2025 | 04:33 PM
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ముంబై టీమ్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. అయితే గతేడాది అతడిని ముంబై యాజమన్యం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన కెరీర్ గురించి మాట్లాడాడు.

రోహిత్ శర్మ (Rohit Sharma).. టీమిండియా కెప్టెన్‌గా, ఐపీఎల్ (IPL 2025)లో ముంబై ఇండియన్స్ సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన ఆటగాడు. ఐపీఎల్‌లో ముంబై (MI) టీమ్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. అయితే గతేడాది అతడిని ముంబై యాజమన్యం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. తాజా ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన ముంబై టీమ్ ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన కెరీర్ గురించి మాట్లాడాడు.
*నా కెరీర్‌ను గమనిస్తే నేను ఎన్నో పాత్రలు పోషించాను. మొదట్లో మిడిలార్డర్‌లో ఆడా. ఆ తర్వాత ఓపెనింగ్‌కు మారాను. ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడాను. ముంబైకి కెప్టెన్సీ చేశా. ఇప్పుడు ఆటగాడిగా మారా. నాతో పాటు ఆడిన వారిలో చాలా మంది ఇప్పుడు కోచ్‌లుగా మారిపోయారు. పాత్రలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ, నా మైండ్‌సెట్ మాత్రం మారలేదు. నా గురించి ముంబై ఇండియన్స్‌కు తెలుసు. మ్యాచ్‌ల్లో గెలుపొందాలి. ట్రోఫీలను గెలవాలి. గత కొన్నేళ్లలో మేం చాలా సార్లు విజేతలుగా నిలిచాం. ఆరంభంలో ఓటములు ఎదురైనా పుంజుకుని విజయాలు సాధించాం* అని రోహిత్ చెప్పాడు.
*జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. ముంబై ఇండియన్స్ కల్చర్ ఏంటో తెలుసు. దూకుడుగా ఆడే ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. అలాగే చాలా మంది యువకులు కూడా ఉన్నారు. ట్రోఫీలు గెలవడమే మా అందరి లక్ష్యం. ముంబైకి మళ్లీ పునర్‌వైభవం తీసుకొస్తాం* అని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Riyan Parag: రియాన్ పరాగ్‌కు అంత పొగరా.. అతడిపై నిషేధం విధించాలంటూ నెటిజన్ల కామెంట్లు
చార్జీకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 02 , 2025 | 06:09 PM