సంజూకి లైన్ క్లియర్
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:30 AM
ఐపీఎల్‌లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే అతడు కీపింగ్ కూడా చేయనున్నాడు...

కీపింగ్ బాధ్యతలకు ఓకే
బెంగళూరు : ఐపీఎల్‌లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే అతడు కీపింగ్ కూడా చేయనున్నాడు. ఈమేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)నుంచి సంజూకి గ్రీస్ సిగ్నల్ లభించింది. గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జోఫ్రా ఆర్చర్ బంతి తగలడంతో శాంసన్ కుడి చూపుడు వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో అతడు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ఆటగాడిగానే సంజూ బరిలో దిగాడు. ఈనేపథ్యంలో రియాన్ పరాగ్ రాయల్స్‌కి సారథ్యం వహిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..