IPL 2025 SRH Vs PBKS Live: మరో ఉత్కంఠ మ్యాచ్ షురూ.. టాస్ గెలిచిన పంజాబ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:27 PM
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్ షురూ అయ్యింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజా్ కింగ్స్ కెప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో మరో ఉత్కంఠ పోరు ప్రారంభమైంది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. వరస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకం. ఈసారైనా ప్యాట్ కమిన్స్ అద్భుతం చేస్తాడా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో హైదరాబాద్‌దే పైచేయి. 16-7 తేడాతో హైదరాబాద్ పంజాబ్‌పై లీడ్‌లో ఉంది. మరోవైపు, సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 9 మ్యాచుల్లో హైదరాబాద్ కేవలం ఒక్క దాంట్లో ఓటమి చవి చూసింది. దీంతో, మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవెన్): ప్రియాంష్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నేహల్ వాదేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యజువేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్స్: సూర్యాంశ్ షెడ్జ్, యశ్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైశాక్ విజయ్‌కుమార్, హర్ప్రీత్ బ్రార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవెన్): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితిష్ కుమార్ రెడ్డి, హీన్‌రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషాన్ అంసారీ, మహమ్మద్ షమీ, ఈషాన్ మాలింగా
ఇంపాక్ట్ సబ్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనడ్కట్
ఇవి కూడా చదవండి:
గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం
బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి