Share News

Tennis Top Players Request: గ్రాండ్‌స్లామ్‌ల ప్రైజ్‌మనీ పెంచాల్సిందే

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:10 AM

ప్రపంచ టెన్నిస్‌ పురుషుల, మహిళల టాప్‌-10 ప్లేయర్లు గ్రాండ్‌స్లామ్‌ల ప్రైజ్‌మనీని పెంచాలని కోరుతూ ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ విషయంలో చర్చించేందుకు మాడ్రిడ్‌లో టెన్నిస్‌ టోర్నీ సందర్భంగా 22 తేదీన సమావేశం జరగనున్నది

Tennis Top Players Request: గ్రాండ్‌స్లామ్‌ల ప్రైజ్‌మనీ పెంచాల్సిందే

నిర్వాహకులకు లేఖ రాసిన టాప్‌-10 ఆటగాళ్లు

న్యూఢిల్లీ: నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల ప్రైజ్‌మనీని పెంచాల్సిందేనని ప్రపంచ టెన్నిస్‌ పురుషులు, మహిళల టాప్‌-10 ప్లేయర్లు స్పష్టంజేశారు. ఈమేరకు వారు ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులకు లేఖ రాశారు. గ్రాండ్‌స్లామ్స్‌ ద్వారా సమకూరే ఆదాయానికి అనుగుణంగా ఆటగాళ్ల ప్రైజ్‌మనీని కూడా పెంచాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు..ఈ విషయమై ఆటగాళ్లతో చర్చించేందుకు ఈనెల 22 నుంచి మాడ్రిడ్‌లో జరిగే టెన్నిస్‌ టోర్నీ సందర్భంగా చర్చలకు రావాలని గ్రాండ్‌స్లామ్‌ నిర్వాహకులను ఆహ్వానించారు. లేఖపై జొకోవిచ్‌, జానిక్‌ సిన్నర్‌, కొకా గాఫ్‌, సబలెంకా తదితర టాప్‌స్టార్లు సంతకం చేశారు.


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు

రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 03:13 AM