Vihan : ఫైనల్లో విహాన్
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:04 AM
దుబాయ్‌లో జరుగుతున్న టెన్ ప్రొ గ్లోబల్ జూనియర్ టూర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన విహాన్ ములుకుట్ల సింగిల్స్ టైటిల్‌కు

హైదరాబాద్: దుబాయ్‌లో జరుగుతున్న టెన్ ప్రొ గ్లోబల్ జూనియర్ టూర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన విహాన్ ములుకుట్ల సింగిల్స్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. అండర్-12 బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్ చిన్నారి విహాన్ 6-4, 6-3తో గాబ్రియెల్ బ్రెగ్వాజ్ (కజకిస్థాన్)పై గెలిచి ఫైనల్ చేరాడు.